శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (13:12 IST)

ధోనీ కుమార్తె జీవా చేతిలో పాండ్యా కుమారుడు... ఫోటో వైరల్

Ziva
క్రికెటర్ హార్దిక్ పాండ్యా, గర్ల్ ఫ్రెండ్ నటాషాకు జూలై 30న కుమారుడు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిన్నారిని ధోనీ దంపతులు కలుసుకున్నారు. ఈ సమయంలో బాబుతో కలిసి ధోనీ కుమార్తె జీవా దిగిన ఫోటోను సాక్షీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఆ చిత్రంలో హార్దిక్ కుమారుడిని ఆప్యాయంగా చూస్తూ మురిసిపోతుంది జీవా. ఈ పోస్ట్‌కు ఇప్పటికే 3.8 లక్షలకు పైగా లైక్స్, 2వేలకు పైకా కామెంట్స్ రావడం విశేషం.
 
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. జూలై 30న నటాషా పడంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇనాళ్ళు కొడుకును చూస్తు మురిసిపోయిన పాండ్యా ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు జిమ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. కొడుకు పుట్టాడన్న ఆనందంతో మరింత ఉత్సాహంగా వర్కవుట్స్ చేస్తున్నాడు.
 
అలాగే గ్రౌండ్‌లోనూ కఠోర సాధన చేస్తూ ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. తాజాగా జిమ్‌లో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ చెమట కక్కుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.