బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (13:40 IST)

వైశాలి విశ్వేశ్వరన్‌తో విజయ్ శంకర్‌కు నిశ్చితార్థం.. త్వరలోనే దుబాయ్‌కి..?

Vijay Shankar
తమిళనాడుకు చెందిన వైశాలి విశ్వేశ్వరన్‌తో టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు పెళ్లి నిశ్చయమైంది. తనకు నిశ్చితార్థం జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విజయ్‌ ప్రకటించాడు. వైశాలితో దిగిన చిత్రాన్ని పోస్ట్‌ చేసి ఉంగరం ఎమోజీని జత చేశాడు. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న విజయ్‌ను టీమిండియా క్రికెటర్లు అభినందించారు.
 
కేఎల్‌ రాహుల్‌, యుజువేంద్ర చాహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కరుణ్‌ నాయర్‌, అభినవ్‌ ముకుంద్‌, జయంత్‌ యాదవ్‌ అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్‌కు సైతం ఈ మధ్యే పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.
 
విజయ్‌ శంకర్‌ 2018లో కొలంబో వేదికగా జరిగిన టీ20లో టీమిఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాదే ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌లో వన్డే కెరీర్‌ను ఆరంభించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2019లోనూ ఆడాడు. అయితే ఒత్తిడికి తట్టుకోలేకపోయాడు. 
 
కాగా.. శంకర్‌ ఇప్పటి వరకు 12 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో అతడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. గత సీజన్‌లో ఫర్వాలేదనిపించాడు. వారం రోజుల్లో జట్టుతో కలిసి దుబాయ్‌కు వెళ్లనున్నాడు.