శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (11:43 IST)

ఐఎంఏ స్కామ్‌లో ఆరోపణలు : సీనియర్ ఐఏఎస్ అధికారి సూసైడ్??

కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 58 యేళ్ళ సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎం విజయ్ శంకర్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఈయన ఐఎంఏ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన తన పడకగదిలోనే ఆత్మహత్య చేసుకుని వుంటారని భావిస్తున్నారు. 
 
అయితే, సమాచారం అందుకున్న పోలీసులు సమాచారం.. సహజ మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే, మృతదేహాన్ని శవపరీక్షకు పంపించి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా, విజయ్ శంకర్ ఇంట్లోని పడక గదిలో చనిపోయివున్నట్టు కుటుంబ సభ్యులు గమనించి తమకు సమాచారం అందించారనీ, మృతికి గల కారణాలు మాత్రం ఇపుడే చెప్పలేమని, శవపరీక్ష నివేదికలోనే తెలుస్తుందని పోలీసులు చెప్పుకొచ్చారు.