శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (17:33 IST)

బాహుబలి2 చిత్రాన్ని ఎన్నిసార్లయినా చూస్తా కారణం ఏమంటే : అఖిల్‌ అక్కినేని

Akhil ph
Akhil ph
హీరో అఖిల్‌ అక్కినేని తన మనసులోని మాటలను బయట పెట్టాడు. 18నెలల సమయంలో సిసింద్రీ సినిమా చేశాను. అది ఇప్పుడు చూస్తే నేనేనా అనిపిస్తుంది. నేను హీరో అయ్యేదాక చాలామంది నేను కనిపిస్తే సిసింద్రీ నువ్వేగా అంటూ బుగ్గ గిల్లేవారు. ఇప్పుడు లేదులేండి.. అంటూ నవ్వారు.  నేను హీరో చేసిన అఖిల్‌ అనే సినిమా నుంచి చేసినవి పెద్దగా ఆడలేదు. అందుకే యాక్షన్‌ బేస్డ్‌ కథతో ఏజెంట్‌ చేశాననంటూ వివరించారు.
 
తనకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. నేను సిక్స్‌ప్యాక్‌ బాడీ కోసం 8నెలలు కష్టపడ్డా. అప్పటికీకానీ నాకు షేవ్‌ రాలేదు. హాలీవుడ్‌ సినిమాలు చూసినా నేను తెలుగు సినిమాలే ఎక్కువ చూస్తాను. పోకిరి సినిమా ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు. ఇక నా ఫేవరేట్‌ మూవీ బాహుబలి2.  ఆ సినిమా అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు చూశా. ఇంకా చూస్తూనే వుంటాను. ఎందుకంటే అలాంటి ఎపిక్‌ సినిమాలాంటిది జీవితంలో ఒక్కసారైనా చేయాలనుందని మనసులోని మాటను వెల్లడించారు.