మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 24 మార్చి 2018 (10:05 IST)

టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ: బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు

చెట్టు-నీరు పథకంలో మట్టి అమ్ముకున్నారని.. పట్టిసీమ ఎత్తిపోతలలో వున్న మెకానిజం ఏంటి? బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీలో బాత్రూమ్‌లు కట్టకుండానే వేల కోట్లు నొక్కేశారని సోము వీర్రాజు ఆరోప

చెట్టు-నీరు పథకంలో మట్టి అమ్ముకున్నారని.. పట్టిసీమ ఎత్తిపోతలలో వున్న మెకానిజం ఏంటి? బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీలో బాత్రూమ్‌లు కట్టకుండానే వేల కోట్లు నొక్కేశారని సోము వీర్రాజు ఆరోపణలు గుప్పించారు. శనివారం సోము వీర్రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని అభివర్ణించారు. 
 
అవినీతిని కింది స్థాయికి తీసుకెళ్లిన పార్టీ టీడీపీయేనని సోమువీర్రాజు ఆరోపించారు. ఏపీలో పరిపాలన గాడి తప్పుతోందని, ఎమ్మెల్యేలను అదుపు చేసే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.27 వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చాయని చెప్పారు. 
 
స్పిల్ వేలో రూ.1400 కోట్ల ఖర్చు ఎందుకు అయిందో చెప్పాలని సోమువీర్రాజు అడిగాడు. మట్టి తీయడానికే రూ.67 కోట్లు ఇచ్చారని, మెయిన్ కెనాల్ లో కలపడానికి పంపు సెట్లకే రూ.817 వెచ్చించారని అన్నారు.