ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (19:58 IST)

నవ్వుల అల్లరి కోసం క‌రోడ్ ప‌తి చూడ‌మంటున్న సోనూసూద్‌

Sonu Sood, Amitabh
క‌రోనా మహమ్మారి సమయంలో మిలియన్ల మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరో సోనూసూద్. ఇప్పుడు కపిల్‌శర్మతో కలిసి తన షో  కౌన్‌బనేగా కరోడ్‌పతి కోసం అమితాబ్‌బచ్చన్‌తో చేరారు. షోలో సృష్టించిన నవ్వుల అల్లరి కోసం శుక్ర‌వారం వ‌ర‌కు వెయిట్ చేయండ‌ని సోనూసూద్ ట్వీట్ చేశాడు.
 
Sonu Sood, Amitabh,Kapil Sharma
వీరు పాల్గొన్న  ప్రోమోను సోనీ సంస్థ విడుదల చేసింది. కెబీసీ షోకు కపిల్ శర్మ నాలుగు గంటల ఆలస్యంగా హాజరయ్యారంటూ అమితాబ్ సెటైర్ వేయగా, అమితాబ్ ఇంటికి ఎవరు అతిథులుగా వెళ్ళినా, వారికి ఆతిథ్యాన్ని అమితాబ్ కేబీసీ స్టయిల్ లో ఇస్తారంటూ కపిల్ శర్మ కామెడీగా చేసి చూపించాడు. మొత్తానికి శుక్రవారం ప్రసారం కాబోయే కేబీసీ ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు సేవాకార్య‌క్ర‌మాల గురించి చ‌ర్చించ‌నున్నారు.