శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 జులై 2019 (15:21 IST)

ఎంజాయ్ చేస్తున్న అమలాపాల్.. ''ఆడై'' సక్సెస్.. రిపోర్టర్‌గా అవతారం

''ఆడై'' సినిమా రిలీజ్‌కు తర్వాత అమలాపాల్ ఖుషీ ఖుషీగా వుంది. ఈ సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. తమిళంలో ఆడై సక్సెస్‌ను అమలా పాల్ సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ సెలబ్రేషన్ కూడా వెరైటీగా ప్రేక్షకుల మధ్యలో చేసుకోవాలని అనుకుంది. 
 
వేషం మార్చింది. ఎవరూ గుర్తు పట్టకుండా టీ షర్ట్ వేసుకొని, తలపై టోపీ పెట్టుకొని, సన్ గ్లాసెస్ పెట్టుకొని రిపోర్టర్‌గా మారిపోయింది. సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులను ఆమె ఎలా ఉందంటూ ప్రశ్నించింది. వారి వద్ద ఫీడ్ బ్యాక్ తీసుకుంది. 
 
కానీ ముందుగా అమలాపాల్‌ను ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోయారు. సినిమా బాగుందని రిపోర్టర్ వేషంలో వున్న అమలాపాల్‌తో చెప్పుకొచ్చారు. కానీ ఓ అభిమాని ఆమెను గుర్తు పట్టడంతో అంతా ఆమె చుట్టూ చేరారు. సినిమా గురించిన కబుర్లను ఆమె నుంచి తెలుసుకున్నారు.
 
ఇకపోతే.. ఆడై సినిమాకు తర్వాత అమలా పాల్ ధైర్యానికి ఓ మంచి ఆఫర్ తలుపుతట్టింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ సినిమా పొన్నియిన్ సెల్వన్ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటించేందుకు అమలా పాల్ ఎంపికైంది.