శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : శనివారం, 20 జులై 2019 (13:58 IST)

''ఆమె'' సినిమా రివ్యూ.. విశ్వరూపం చూపెట్టిన అమలాపాల్

సినిమా పేరు:  ఆమె
న‌టీన‌టులు: అమలాపాల్, ర‌మ్య సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌, శ్రీ‌రంజ‌ని, వివేక్ ప్ర‌స‌న్న తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: ర‌త్న‌కుమార్
సంగీతం: ప‌్ర‌దీప్ కుమార్
నిర్మాత‌లు: రాంబాబు క‌ల్లూరి, వియ్ మోర‌వెనేని  
 
ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలాపాల్ తాజా సినిమా ''ఆమె'' సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్.. సెన్సేషనల్ క్రియేట్ చేశాయి. దీంతో పాటు విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ట్రైలర్‌లో అమ‌లాపాల్ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా న‌గ్నంగా క‌నిపించి అందరికీ షాక్ ఇచ్చింది. 
 
ఈ హైప్‌తో అమలా పాల్ నటనకు పాజిటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ వచ్చినా.. చాలామంది అమ‌లాపాల్‌కు మ‌ద్ద‌తునిచ్చారు. ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాల‌ని కితాబిచ్చారు. ఇంతవరకు తమిళ హీరోయిన్లు చేయని క్యారెక్టర్‌లో అమలాపాల్ నటించింది.  క్ర‌మంలోనే ఆమె మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా శనివారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో అమలాపాల్ ఏమేరకు నటించి ప్రేక్షకులను ఆకట్టుకుందో రివ్యూ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం.. 
 
క‌థ‌లోకి వెళితే.. 
కామిని (అమ‌లాపాల్‌) పూర్తిగా పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తుంది. ఈమెకు బెట్ కట్టడం అంటే చాలా ఇష్టం. అంతేగాకుండా ఆ బెట్‌లో గెలవడం కోసం ఎంతైనా సాహసిస్తుంది. అలా త‌న స్నేహితురాళ్ల‌తో ఎప్పుడూ ఏదో ఒక విష‌య‌మై బెట్ క‌డుతూ జీవితాన్ని జాలీగా గ‌డుపుతూ ఉంటుంది.  ఈ క్ర‌మంలోనే ఒక రోజు ఈమె త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి పీక‌ల‌దాకా మ‌ద్యం సేవిస్తుంది. 
 
అనంత‌రం కామిని ఇంటికి వెళ్ల‌దు. దీంతో త‌న కూతురు ఇంటికి రాక‌పోయేస‌రికి కామిని త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తుంది. ఆ త‌రువాత కామిని ఒక పాడుబ‌డ్డ బంగ్లాలో ఒంటి మీద నూలు పోగు లేకుండా క‌నిపిస్తుంది. అదే స్థితిలో ఆమెకు మెళ‌కువ వ‌స్తుంది. దీంతో ఆమె ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌వుతుంది.
 
అయితే ఆమె అస‌లు ఆ బంగ్లాకు ఎందుకు చేరుకుంది ? ఆమె న‌గ్నంగా ఎందుకు ప‌డి ఉంది ? అస‌లు ఆ రోజు ఏం జ‌రిగింది ? చివ‌ర‌కు క‌థ ఏమ‌వుతుంది ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
న‌టీన‌టుల ప‌నితీరు:
నటీనటులు పాత్రకు తగిన న్యాయం చేశారు. అమలాపాల్ నటన అదిరింది. ఆమె సినిమాను ఒంటి చేత్తో న‌డిపించింద‌నే చెప్ప‌వ‌చ్చు. సినిమాలో అమ‌లాపాల్ న‌ట‌న ఒక రేంజ్‌లో ఉంటుంది. ఈ సినిమాలో ఆమె న‌ట‌నలో విశ్వ‌రూపం చూపించింది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా వ‌చ్చిన ఈ మూవీలోని ప్రతి సన్నివేశంలోనూ అమలాపాల్ కనిపిస్తుంది. 
 
ఎక్కడా మూవీ బోర్ కొట్టదు. సినిమా మొద‌టి భాగం మొత్తం కామిని ఇంట్ర‌డక్ష‌న్‌, ఆమె జీవ‌నం, స్నేహితురాళ్లో క‌లిసి ఆమె చేసే హంగామా మ‌న‌కు క‌నిపిస్తాయి. ఆ త‌రువాత భాగంలో అసలు క‌థ మొద‌ల‌వుతుంది. సినిమా రెండో భాగంలో వ‌చ్చేకొన్ని స‌స్పెన్స్ సీన్లు ప్రేక్ష‌కుల‌లో ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయి. త‌రువాత ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠ వుంటుంది. ఇక క్లైమాక్స్‌లో ఇచ్చే ఫినిషింగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.
 
లేడి ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ.. సస్పెన్స్ జనాలను థ్రిల్ చేస్తుంది. ఈ చిత్రం దర్శకుడు చక్కని మెసేజ్ ఇచ్చాడు. ఈ మూవీని అమ‌లాపాల్ మొత్తం ద‌గ్గ‌రుండి న‌డిపిస్తూ.. క్రెడిట్ మొత్తాన్ని ఆమే కొట్టేసింది. ఇక మూవీలో న‌టించిన మిగిలిన న‌టీన‌టులు కూడా త‌మ త‌మ పాత్ర‌లకు న్యాయం చేశారు. అలాగే ఈ మూవీని చ‌క్క‌ని ప్రొడ‌క్ష‌న్ విలువ‌ల‌తో తెరకెక్కించార‌ు. విజ‌య్ కార్తీక్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంటుంది. మ్యూజిక్‌కు ఈ మూవీలో పెద్ద‌గా స్కోప్ లేక‌పోయినా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోరును సీన్ల‌కు త‌గిన‌ట్లు అందించారు.
 
ఆమె సినిమా రేటింగ్‌: 3/5