శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: సోమవారం, 22 ఏప్రియల్ 2019 (19:32 IST)

వేశ్య‌గా త‌న ప్యూర్ సోల్‌ని చూపించిన శ్ర‌ద్ధాదాస్‌

తెలుగులో ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు ధ‌రించి యూత్‌ని ఆక‌ట్టుకున్న శ్ర‌ద్దాదాస్ చాలా గ్యాప్ త‌రువాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది. ఒక వేశ్య మనోభావాన్ని క‌ల్మ‌షం లేని హృద‌యాన్ని క‌ళాత్మ‌క దృష్టితో తెర‌కెక్కించిన ఈ చిత్రం పేరు ప్యూర్ సోల్‌.. స్టార్‌డ‌మ్ వున్న న‌టీన‌టులు ఇలాంటి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాలు చేస్తే స‌మాజానికి ఎంతో కొంత మేలు జ‌రుగుతుందనే చెప్పాలి. 
 
బాలీవుడ్‌లో ఇలాంటి మెసెజ్ ఓరియంటెడ్ ల‌ఘు చిత్రాల్లో చాలామంది స్టార్స్ న‌టించ‌టం మ‌న‌కు తెలుసు.. టాలీవుడ్లో కూడా ఇలా స్టార్స్ న‌టించిన సంద‌ర్బాలు వున్నాయి.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐయామ్ ద‌ట్ ఛేంజ్ అనే ల‌ఘు చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంది.. అలానే సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ క‌మెడియ‌న్ వైవా హ‌ర్షాతో క‌లిసి డ్రంక్ అండ్ డ్రైవ్, నేను మీ క‌ళ్యాణ్ లాంటి ల‌ఘు చిత్రాలు చేశారు.. అలాగే హీరోయిన్స్ రెజీనా కూడా మంచి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాల్లో న‌టించింది. ఇప్ప‌డు అదే త‌ర‌హ‌లో చాలా బోల్డ్ పాత్ర‌లో శ్ర‌ద్ధాదాస్ న‌టించ‌డం విశేషం. 
 
క‌థ విష‌యానికోస్తే వ‌ర్ణ, ప్రేమలో విఫ‌ల‌మైన ఒక మంచి పెయింట‌ర్‌.. త‌న ప్యారిస్ ఎగ్జిబిష‌న్లో 100 వ పెయింటింగ్ కోసం ఒక వేశ్య‌( శ్వేత)ని ఎంచుకుంటాడు.. త‌ను ప్రేమించిన అమ్మాయి త‌న మొద‌టి పెయింటింగ్‌గా మొద‌లుపెట్టిన వ‌ర్ణ త‌న నూర‌వ పెయింటింగ్‌ కోసం శ్వేతని ఎంచుకుంటాడు.. అయితే పెయింటింగ్ వేస్తున్న స‌మ‌యంలో వీరిద్ద‌రి మధ్య జ‌రిగిన సంభాష‌ణలో శ్వేతలో ఒక ప్యూర్ సోల్‌ని చూస్తాడు వ‌ర్ణ‌.
 
అదేస‌మ‌యంలో స‌మాజంలో నిజాయితిని వ‌ర్ణలో చూస్తుంది శ్వేత‌.. త‌ను ప్రేమించిన అమ్మాయిలో అబ‌ద్దాన్ని చూసిన వ‌ర్ణకి శ్వేతలో ప్యూరిటి ఆఫ్ వుమెన్ క‌నిపించింది. వీరిద్ద‌రి మ‌ద్య జ‌రిగిన సంభాష‌ణ‌లో వ‌ర్ణ పెయింటింగ్ వేస్తాడు.. అస‌లు ఆ పెయింటింగ్ ఏంటి అనేది ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు.. 
 
ద‌ర్శ‌కుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి చ‌క్క‌గా త‌ను అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా తెర‌కెక్కించాడు. ముఖ్యంగా వ‌ర్ణ‌, శ్వేతల మ‌ద్య వ‌చ్చే సంభాష‌ణ‌లు చాలా చ‌క్క‌గా రాసుకున్నాడు. ప్ర‌తి ఫ్రేమ్‌ని చాలా చక్క‌గా చూపించాడు. టెక్నిక‌ల్‌గా అందంగా చూపించాడు. ముఖ్యంగా కొత్తవాడిని న‌మ్మి ఇలాంటి పాత్రలో న‌టించిన శ్ర‌ద్దాదాస్‌కి ఈ చిత్ర యూనిట్ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు.. 
 
ఈ ప్యూర్‌సోల్ అనే ల‌ఘు చిత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో స్క్రీనింగ్ చేసారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత శివ‌శ‌క్తి దత్తా, ప్ర‌ముఖ నిర్మాత‌లు రామ్ త‌ల్లూరి, ర‌జ‌ని త‌ల్లూరి, రాజ్ కందుకూరి మ‌రియు స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్య‌న్‌లు హాజ‌ర‌య్యారు.