సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:40 IST)

ఆ భయంతో అతడు వాడిన కండోమ్‌ను మింగేసిన మహిళ....

తైవాన్‌లో వ్యభిచారం చేయడం చట్టరీత్యా నేరం. రైడ్ చేసినప్పుడు దొరికితే ఆ విటుడితో పాటుగా మహిళకు కూడా జైలు శిక్ష విధిస్తారు. ఈ నేపథ్యంలో ఒక మహిళ పోలీసులకు దొరకకూడదని విటుడు ఉపయోగించిన కండోమ్‌ను ఏకంగా మింగేసింది.
 
తైవాన్‌లో ఒక మహిళ వేశ్య వృత్తితో జీవనం సాగిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆమెను బుక్ చేసుకున్న ఒక వ్యక్తితో కలిసి లాడ్జికి వెళ్లింది. ఆ సమయంలో పోలీసులు ఆ లాడ్జిని రైడ్ చేసారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె విటుడు వాడిన కండోమ్‌ను మింగేసి, ఏమీ ఎరగనట్లు రూమ్‌లో కూర్చుని పోలీసులు వచ్చేసరికి సాధారణంగా మాట్లాడుకుంటూ కనిపించారు. 
 
గది మొత్తం వెతికినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక పోలీసులు గట్టిగా అడిగేసరికి కస్టమర్ నిజం చెప్పేసాడు. అంతేకాకుండా ఆమె పదేపదే మంచినీరు తాగుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి, స్కానింగ్ చేసి చూడగా ఆమె ఊపిరితిత్తులలో కండోమ్ కనిపించిందట. పోలీసులకు ఆధారాలు దొరకూడదని ఇలాంటి పని చేయడం చూసి అవాక్కవ్వడం వారి వంతైంది.