ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 15 జనవరి 2017 (17:28 IST)

హర్ధవర్ధన్ దర్శకత్వంలో శ్రీముఖి హీరోయిన్.. సోలోగా బంపర్ ఆఫర్ కొట్టేసింది..

యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం తన గ్లామర్‌తో చాలా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద కూడా హీరోయిన్‌గా మెరిసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్‌గా 'ప్రేమ ఇష్క్ కాదల్', కమెడియన్ ధన్ రాజ

యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం తన గ్లామర్‌తో చాలా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ మీద కూడా హీరోయిన్‌గా మెరిసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్‌గా 'ప్రేమ ఇష్క్ కాదల్', కమెడియన్ ధన్ రాజ్ 'లక్ష్మీదేవి తలుపు తట్టింది' లాంటి సినిమాలు చేసింది. 
 
కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. తరువాత 'జులాయి'లో అల్లు అర్జున్‌కి సిస్టర్‌గా.. నాని 'జెంటిల్మన్'లాంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరికి 'బాబు బాగా బిజీ' లాంటి అడల్ట్ కామెడీ సినిమాలు చేసింది. కానీ హీరోయిన్‌గా లిఫ్ట్ ఇచ్చే సినిమా శ్రీముఖికి ఇంతవరకూ పడలేదు. ప్రస్తుతం శ్రీముఖికి బంపర్ ఆఫర్ వచ్చింది. 
 
యాక్టర్ కమ్ డైలాగ్ రైటర్ హర్షవర్ధన్ త్వరలో డైరెక్టర్‌గా మారి చేస్తున్న మూవీలో శ్రీముఖిని హీరోయిన్‌గా ఫిక్స్ చేసాడు. ప్రస్తుతం దర్శకుడిగా 80నాటి రొమాంటిక్ థ్రిల్లర్ చేయబోతున్నాడు. 'గుడ్.. బ్యాడ్..అగ్లీ' అనేది ఈ మూవీ అనఫిషియల్ టైటిల్ అని తెలుస్తోంది.