1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 10 జులై 2025 (11:38 IST)

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Srileela at beach
Srileela at beach
యువ నటి శ్రీలీల షేర్ చేసిన ఈ తాజా రీల్ ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తరచు ఏదో విధంగా రీల్స్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తుంటుంది. ఆమద్య చార్మినాల్ దగ్గర కూడా డాన్స్ చేస్తూ రీల్ చేసి అలరించింది. తాజాగా నిన్న రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ప్రశాంతమైన బీచ్ వాతావరణంలో నడుతూ,పరుగెడుతూ ఆకాశంలో మేఘాలు కొంతకాంతి వైపు చూస్తూ అందాన్ని ఒక చూపులో చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది.
 
సముద్రపు ఇసుకపై నడుస్తు,  శ్రీలీల "నా కాంతి వైపు నడవడం లాంటిది" అనే క్యాప్షన్‌ను జోడించారు.అంతకుముందు ఓసారి మంచుకొండలలో కూడా నడుస్తూ ఓ రీల్ చేసింది. డాక్టర్ అయినా శ్రీలీల మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే. ఇక సినిమాలపరంగా ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్‌తో ఆషికి 3, కిరీటితో జూనియర్, రవితేజతో మాస్ జతారా, శివకార్తికేయన్ పరాశక్తి, పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ భారీ సినిమాల్లో నటిస్తోంది. జూనియర్ సినిమా షూటింగ్ లో ఓ సాంగ్ చేస్తూ హీరో రెండు కాల్ళపై ఎక్కి డాన్స్ చేసే ప్రక్రియ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.