గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (18:45 IST)

బిగ్ బాస్ కెమెరాలకే చిక్కకుండానే ఆ పని చేసిన హౌస్ మేట్స్? (video)

బిగ్ బాస్ హౌజ్ నిండా కెమెరాలే. ఒక్క బాత్రూమ్ మినహా అన్ని చోట్లా కెమెరా కళ్లూ చూస్తూనే వుంటాయి. బిగ్ బాస్ హౌస్‌లో ఓ కండిషన్ ఉంది. ఉదయం లైట్లు వెలిగిన దగ్గరి నుంచి మళ్లీ బిగ్ బాస్ లైట్లు ఆర్పే వరకు ఎవరూ నిద్రపోవడానికి వీల్లేదు. పగలు ఎవరైనా నిద్రపోతే.. కెమెరా కళ్లు పసిగట్టేస్తాయి. అప్పుడు కుక్క అరుస్తుంది. వారిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. 
 
అయితే, బిగ్ బాస్‌కు తెలియకుండా, కెమెరా కళ్లుగప్పి హౌస్‌మేట్స్ నిద్రపోయేవారట. అదెలాగంటే అమ్మాయిలు ఫక్కర్ అనే వస్తువుతో ఐబ్రోస్‌ను కట్ చేసుకుంటారు. అలా లాగిప్పుడు బాగా నొప్పి పుడుతుంది. కాబట్టి ఆ బాధను తట్టుకోవడానికి కళ్లుమూసుకుంటారు. ఈ లాజిక్‌ను శ్రీముఖి అండ్ టీమ్ బాగా వాడుకుంది.
 
అమ్మాయిలు ఐబ్రోస్ కట్ చేసుకున్నట్టుగా నటిస్తూ.. కళ్లుమూసుకుని కాసేపు నిద్రపోయేవారు. అలా ఒకరికొకరు 15 నిమిషాలు ఐబ్రోస్ కట్ చేస్తున్నట్టు నటిస్తూ నిద్రపోయేవారు. ఇది అమ్మాయిలే కాదు. అబ్బాయిలు కూడా ఫాలో అయ్యారు. 
 
వరుణ్, రవి, బాబా మాస్టర్‌లు ఐబ్రోస్ లాగుతున్నట్లు నటిస్తూ నిద్రపోయేవారట. ఇలా చాలాసార్లు రవికృష్ణ వరుణ్‌కి, వరుణ్ సందేశ్.. బాబా మాస్టర్‌కి, బాబా మాస్టర్ వరుణ్ తేజ్‌కి.. ఐబ్రోస్ పీకుతున్నట్టుగా నటిస్తూ నిద్రపోయేవారు. కానీ, ఆ టెక్నిక్‌ను బిగ్ బాస్ కెమెరాలు కనిపెట్టలేకపోయాయి. అది తెలుసుకునేలోపే మూడో సీజన్ కూడా ముగిసిపోయింది.