పునర్నవి సెన్సేషనల్ కామెంట్స్.. మేమిద్దం మంచి ఫ్రెండ్స్ మాత్రమే..
బిగ్ బాస్ కంటిస్టెంట్ పునర్నవి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్, పున్నుల మధ్య ప్రేమాయణం నడుస్తుందని జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఇద్దరు ఇష్టపడి.. ఇరు కుటుంబాలు కూడా ఇష్టపడితే పెళ్లి చేసి పెడతామని రాహుల్ తల్లిదండ్రులు ఇప్పటికే కామెంట్స్ చేశారు. ఇక పునర్నవి పారెంట్సే పెళ్లికి ఒప్పుకోవాలని అందరూ అనుకున్నారు.
కానీ పునర్నవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. రాహుల్‌కు తన మధ్య జరిగింది ఏమీ లేదని పున్ను చెప్పింది. మా ఇద్దరి మధ్య జరిగింది, బిగ్‌బాస్ హౌస్‌లో జరిగింది, బయట చూపించింది.. ఇలాంటి వాటితో తన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపదు. తానేంతో తనతో వుండే వారికి బాగా తెలుసునని చెప్పుకొచ్చింది. ఇంకా రాహుల్ తాను మంచి ఫ్రెండ్స్ అని మరోసారి కుండబద్దలు కొట్టేసింది పునర్నవి.
ఇకపోతే.. బిగ్‌బాస్ టైటిల్ గెలిచినా కూడా ఎక్కడా ఆ పొగరు, గర్వం చూపించడం లేదు రాహుల్. తాను గేమ్ ఆడనేలేదని, తాను ఎలా ఉన్నానో అలానే ఉన్నానని, జెన్యూన్‌గా ఉన్నానని అందుకే గెలిచానని చెప్పుకొస్తున్నాడు. తాను టైటిల్ గెలుస్తానని కూడా అనుకోలేదని చెప్పుకొచ్చాడు. ముక్కుసూటితనంగా వ్యవహరించడం, ఏ మూలన గేమ్ ఆడుతున్నట్లు, ఫేక్ ఎమోషన్లు చూపించని కారణంగానే రాహుల్ అందరి మనసులను గెలుచుకుని విజేతగా నిలిచాడు.