గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (18:46 IST)

రంగస్థలం సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. గెలుపుకు సీఎం జగన్ ఫ్యాన్స్ కారణమా? (video)

బిగ్ బాస్ విన్నర్ రాహుల్‌కు శ్రీముఖి కంటే ఎక్కువ ఓట్లు రావ‌డం వెన‌క ఏపీ సీఎం జ‌గ‌న్ ఉన్న‌ట్టు వైసీపీ అభిమానులు చెపుతున్నారు. రాహుల్ ఎన్నికలకు ముందు జగన్‌ ఇమేజ్‌ను హైలెట్ చేస్తూ అదిరిపోయే రేంజ్‌లో ఓ పాట పాడాడు.

ఆ పాట అప్ప‌ట్లో జ‌గ‌న్ ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అందుకే ఇప్పుడు రాహుల్‌కు జ‌గ‌న్ ఫ్యాన్స్‌, వైసీపీ అభిమానులు భారీగా ఓట్లు వేసి మ‌రీ అత‌డిని గెలిపించాల‌ని ప్రచారం జరిగిందని తెలుస్తోంది. వైకాపా ఫ్యాన్స్ రాహుల్‌కు బాగానే ఓట్లు వేశారని.. తద్వారా రాహుల్ విన్నర్‌గా నిలిచాడని టాక్ వస్తోంది. 
 
ఇకపోతే.. సింగ‌ర్‌ రాహుల్ సిప్లిగంజ్‌, యాంక‌ర్‌ శ్రీ‌ముఖి, న‌టుడు వ‌రుణ్ సందేశ్‌, పాపుల‌ర్ డ్యాన్స్ మాస్ట‌ర్ బాబా బాస్క‌ర్‌, టీవీ న‌టుడు అలీ రెజా గ్రాండ్ ఫినాలే బ‌రిలో నిలిచారు. అయితే బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలే చివ‌రి రోజైన ఆదివారం ఐదుగురు కంటెస్టెంట్స్‌లో వ‌రుణ్‌సందేశ్‌, అలీరేజా, బాబా భాస్క‌ర్‌ ఎలిమినేష‌న్ అయ్యారు. చివ‌రిగా రాహుల్‌, శ్రీ‌ముఖి ఫైన‌ల్‌కు చేరుకుని ట్రోపీ కోసం గ‌ట్టిగానే పోటీ ప‌డ్డారు. ఇందులో చివ‌రికి బిగ్‌బాస్ 3 విజేత‌గా సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ నిలువ‌గా, ర‌న్న‌ర‌ర్‌గా యాంక‌ర్ శ్రీ‌ముఖి నిలిచారు.
 
అలాగే బిగ్ బాస్ మూడో సీజన్ విజేత రాహుల్ 1989, ఆగస్టు 22న హైదరాబాదులోని ధూల్ పేటలో జన్మించాడు. లయోల హైస్కూల్‌లో ఉన్నత విద్యను, నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తిచేశాడు. చిన్నప్పటి నుంచి పాటలపై ఉన్న ఆసక్తితో, వంటగదిలోని వస్తువులతో సంగీతం వాయిస్తూ పాటలు పాడేవాడు. దీన్ని గమనించిన రాహుల్ తండ్రి పండిత్ విఠల్ రావు దగ్గరికి పంపించి సంగీతం నేర్పించాడు. సొంతంగా పాటల వీడియోలను రూపొందించి యూట్యూబ్‌లో పెట్టేవాడు. వాటిని మంచి స్పందన వచ్చింది. ఈక్రమంలో దాదాపు 20కి పైడిన పాటల వీడియోలను రిలీజ్ చేశాడు. 15 సినిమాలకు పాటలు పాడాడు.  
 
రాహుల్ 20 సంవత్సరాల వయసులో 2009లో జోష్ చిత్రం తొలిసారిగా పాడాడు. ఆ తరువాత దమ్ము సినిమాతో పాటు వాస్తు బాగుందే, రచ్చ సినిమాలో సింగరేణి ఉంది, ఛల్ మోహన రంగా సినిమాలో పెద్దపులి వంటి పాటలతో గుర్తింపు పొందాడు. 2018లో వచ్చిన రంగస్థలం సినిమాలో రాహుల్ పాడిన రంగ రంగ రంగస్థలానా పాటకు అత్యంత ప్రజాదరణ లభించింది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోని ఏ మెలికెల్ పాటలో స్పానిష్ భాగాన్ని పాడాడు.