బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:02 IST)

ప్రతి చిన్న విషయానికీ ఏడుపు.. ఆ ఎమోషనే శివజ్యోతి కొంపముంచింది..

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో ముగియనుంది. ఈ వారం అనూహ్యంగా శివజ్యోతి ఎలిమినేట్ అయ్యింది. అయితే శివజ్యోతి ఎలిమినేషన్‌కు కారణం ఏమిటని సర్వత్రా చర్చ సాగుతోంది. ఇందుకు ఆమె ఏడుపే కారణమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్‌ హౌస్‌లో ఎలాంటి టాస్క్ ఇచ్చినా శివజ్యోతి వెనకడుగు వేయలేదు. 
 
బిగ్‌బాస్ ఎలాంటి టాస్క్‌ ఇచ్చినా వెనకడుగు వేయలేదు. మగవారితో సమానంగా పోటీ పడింది. కింగ్ టాస్క్‌లో శివజ్యోతిని అలీ అమాంతంగా తోసేయడం నుంచి ఆమె పేరు ఎక్కువగా వినిపించసాగింది. అలా తోసేసినా గొడవ చేయకుండా స్పోర్టీవ్‌గా తీసుకోవడంతో అందరూ ప్రశంసించారు.
 
ప్రతీ చిన్న ఎమోషన్‌కు ఏడుస్తూ చూసే ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. అయితే అది తన ఎమోషన్ అని, దాని వల్ల టాస్క్‌లకు గానీ, బిగ్‌బాస్ హౌస్‌కు గానీ ఎలాంటి నష్టం వాటిల్లదలేదని, మళ్లీ కొంతసేపటికే నార్మల్ అవుతానని చెప్పుకున్నా.. ఏడుపును మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఏడుపును ఆపుకోలేకపోవడంతో.. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చేసిందని టాక్ వస్తోంది. 
 
ఇంకా టికెట్ టు ఫినాలే టాస్క్‌లో ఓడిపోయిన నామినేషన్‌లోకి వచ్చిన శివజ్యోతి.. ఊహించినట్టుగానే ఎలిమినేట్ అయింది. అయితే అంతకుముందే ఇదే విషయాన్ని బాబా భాస్కర్‌తో చర్చిస్తూ.. అలీ, తాను వెళ్లాకే బాబా వెళ్తాడని, తామిద్దరమే డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. అనుకున్నట్లే శివజ్యోతి ఎలిమినేట్ అయింది.
 
ఇకపోతే.. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన శివజ్యోతి అందరితో కలిసి బాగానే ఎంజాయ్ చేస్తోంది. హౌస్‌లో క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా మారిన హిమజ, అషూ, శివజ్యోతి, మహేష్, రవి అందరూ కలిసి పబ్‌లో ఎంజాయ్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు హిమజ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
హౌస్‌లో మొదటి రెండు మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోతుందని అందరూ భావించినా.. చాప కింద నీరులా వస్తూ పద్నాలుగో వారం వరకు షోలో కొనసాగింది.టాప్ ఫైనల్ అయ్యేందుకు అన్ని అర్హతలున్నా.. కాలం కలిసి రాలేదు. దీంతో ఇంటి బాట పట్టింది.