శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 జులై 2018 (11:25 IST)

మీడియాపై శ్రీరెడ్డి ఫైర్... చీడ పురుగుల కంటే వ్యభిచారం చేసే అమ్మాయి బెటర్

వ్యభిచారం కేసులో అరెస్టు అయినట్టు వస్తున్న పుకార్లపై నటి శ్రీరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ఇదే అంశంపై ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తానేమీ వ్యభిచారం కేసులో అరెస్టు కాలేదంటూ స్పష్టం చేశా

వ్యభిచారం కేసులో అరెస్టు అయినట్టు వస్తున్న పుకార్లపై నటి శ్రీరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ఇదే అంశంపై ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తానేమీ వ్యభిచారం కేసులో అరెస్టు కాలేదంటూ స్పష్టం చేశారు. 
 
క్యాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి.. ఆ తర్వాత టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేసింది. ఇపుడు కోలీవుడ్ చిత్ర రంగంలోని ప్రముఖులపై విమర్శలు గుప్పిస్తోంది.
 
ఈ నేపథ్యంలో ఓ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వ్యభిచారం చేసినట్టు శ్రీరెడ్డి అంగీకరించింది. దీంతో తమిళ నటుడు వారాహి అమెను వ్యభిచారం కేసు కింద అరెస్టు చేయాలంటూ చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా, ఆమెపై కేసు నమోదైంది. 
 
ఈ పరిస్థితుల్లో తనపై వ్యభిచారం కింద కేసు నమోదైందని, అరెస్ట్ చేశారని కొన్ని టీవీ చానళ్లలో, యూట్యూబ్‌లో జోరుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై శ్రీరెడ్డి మండిపడింది. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, తాను వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యానంటూ కొన్ని మీడియా, యూట్యూబ్ చానల్స్ రూమర్స్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపించింది. 
 
తానేమీ వ్యభిచారిని కాదని చెప్పిన ఆమె, డబ్బుకోసం అమ్మాయిని వాడుకుంటున్న మీరే వ్యభిచారం చేస్తున్నట్టని, డబ్బుల కోసం అసత్యాలను సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగింది. మీలాంటి మీడియా చీడ పురుగుల కన్నా వ్యభిచారం చేసే అమ్మాయి ఎంతో బెటరని, కొన్ని యూట్యూబ్ చానల్స్‌కు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నట్టు ఆ పోస్ట్‌లో పేర్కొంది.