శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (15:09 IST)

బంగారు రంగు చీరలో... ఏడు వారాల నగలతో : మానవా.. ఇక సెలవ్ అంటూ... (వీడియో)

భూలోక అతిలోక సుందరి శ్రీదేవి అంతియ యాత్ర ముంబైలో లక్షలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య ప్రారంభమైంది. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్ తారలతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ తారలు ముంబైలోని శ్రీదేవి

భూలోక అతిలోక సుందరి శ్రీదేవి అంతియ యాత్ర ముంబైలో లక్షలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య ప్రారంభమైంది. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్ తారలతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ తారలు ముంబైలోని శ్రీదేవి నివాసానికి తరలివచ్చారు. వీరంతా నివాళులు అర్పించిన తర్వాత శ్రీదేవికి పార్థివదేవానికి ఆమె కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఆ తర్వాత ముంబై పోలీసు బ్యాండ్ సెల్యూట్ అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమైంది. శ్రీదేవికి కాంచీవరం చీరలంటే చాలా ఇష్టమట. అందులో బంగారు రంగు చీరలంటే అమిత ఇష్టమట. అందుకే ఆమె భౌతికకాయానికి బంగారు వర్ణంతో కూడిన కాంచీవరం చీరను కప్పి అంతిమయాత్ర నిర్వహించారు. సెలబ్రేషన్ స్పోర్స్ట్ క్లబ్ నుంచి ఆమె భౌతికకాయాన్ని విలేపార్లే హిందూ శ్మశానవాటికకు తరలించారు.
 
ఆమె భౌతికకాయానికి జాతీయ జెండాను కూడా కప్పారు. ఆమె భౌతికకాయాన్ని తరలిస్తున్న వాహనాన్ని పూర్తిగా తెలుపురంగు పూలతో అలంకరించారు. శ్రీదేవికి తెలుపు రంగంటే చాలా ఇష్టమట. అందుకే అంతా తెలుపు రంగు పూలతో అలంకరించారు. ఆమె భౌతికకాయం వెంట భర్త బోనీకపూర్, అర్జున్ కపూర్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
 
ముంబైలో శ్రీదేవి నివాసం ఉండే గ్రీన్ యాక్రెస్ ప్రాంత వాసులు తమ అభిమాన నటికి ఘన నివాళి అర్పించారు. శ్రీదేవి మృతికి సంతాపంగా మార్చి 2న హోలీ వేడుకలను రద్దు చేస్తూ గ్రీన్ యాక్రెస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ‘‘మా సభ్యురాలు శ్రీదేవి విషాద మరణం నేపథ్యంలో, తన నటనతో మాకు వినోదాన్ని పంచిన ఆమె ఆత్మకు గౌరవ సూచకంగా మార్చి 2న హోలీ వేడుకలను రద్దు చేయాలని నిర్ణయించాం. దీంతో ఆ రోజు సంగీతం, రెయిన్ డ్యాన్స్, రంగు నీళ్లు చిమ్ముకోవడాలు వంటివి ఏవీ ఉండవు’’ అని సొసైటీ తన ప్రకటనలో పేర్కొంది.