మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (20:54 IST)

'తెల్లచీరకు తకధిమి తపనలు'... శ్రీదేవి అంతిమ యాత్రలో తెల్లపూలు...

దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవికి తెలుపు రంగు అంటే మహా ఇష్టమట. అందుకే ఆమె జీవించివున్నపుడు... తన కుటుంబ సభ్యులతో తన అంతిమయాత్రలో కేవలం తెల్లపూలు మాత్రమే ఉపయోగించాలని చెప్పారట. ఆమె చెప్పినట్టుగ

దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన నటి శ్రీదేవికి తెలుపు రంగు అంటే మహా ఇష్టమట. అందుకే ఆమె జీవించివున్నపుడు... తన కుటుంబ సభ్యులతో తన అంతిమయాత్రలో కేవలం తెల్లపూలు మాత్రమే ఉపయోగించాలని చెప్పారట. ఆమె చెప్పినట్టుగానే బుధవారం జరిగే అంతిమ సంస్కారంలో తెల్లపూలనే వాడనున్నారు. 
 
దీనికి బలాన్నిస్తూ, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నివాసంలోకి తెల్లని పువ్వులతో నిండిన గంపలను భారీ సంఖ్యలో తీసుకెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, ఆమె భౌతికకాయాన్ని తరలించేందుకు ఉపయోగించే వాహనాన్ని కూడా తెల్లపూలతోనే అలంకరించనున్నారట. 
 
కాగా, మంగళవారం రాత్రి ముంబైకు చేరుకునే శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం 11 గంటల వరకు శ్రీదేవి స్వగృహంలో ఉంచుతారు. ఆ తర్వాత అంటే 3 గంటల సమయంలో అంత్యక్రియలు జరగనున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.