శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (17:26 IST)

కథలని బ్యాంకు లాకర్‌లో ఉంచిన్నట్లు దాచుకుంటా - సముద్రఖని

Samudrakhani
Samudrakhani
హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.  శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ  నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపధ్యంలో  ఈ చిత్రంలో ప్రతినాయకుడు రాజప్ప పాత్ర పోషించిన నటుడు సముద్రఖని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
 
తెలుగులో మీ ప్రయాణం ఎలా సాగుతోంది ?
తెలుగులో నా ప్రయాణం అద్భుతంగా వుంది. తివిక్రమ్ గారు ఒక గిఫ్ట్ లా 'అల వైకుంఠపురంలో' ఇచ్చారు. క్రాక్, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారిపాట ఇలాంటి మంచి చిత్రాలు చేసే అవకాశం దొరికింది. త్రివిక్రమ్, రాజమౌళి, గోపిచంద్ మలినేని, పరశురాం లాంటి అద్భుతమైన దర్శకులతో కలసి పని చేసిన అవకాశం దొరకడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.  
 
మాచర్ల నియోజికవర్గం ప్రయాణం ఎప్పుడుమొదలైయింది ?
గత ఏడాది దర్శకుడు రాజశేఖర్ గారు మాచర్ల కథ చెప్పారు. చాలా నచ్చింది. తమిళనాడులోని ఓ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఇరవై ఐదేళ్ళుగా అక్కడ ఎలక్షన్ జరగలేదు. చివరికి ఉదయ్ చందర్ అనే ఒక ఐఎఎస్ అధికారి చొరవ తీసుకొని అక్కడ స్థానికులతో మాట్లాడి పరిస్థితులని చక్కదిద్ది ఎన్నికలు జరిపారు. దర్శకుడు శేఖర్ తో కూడా అదే సంగతి చెప్పా. చాలా అద్భుతమైన కథ. తప్పకుండా చేస్తానని చెప్పా. ఇందులో నా పాత్రలో ఒక సర్ప్రైజ్ వుంది. అది థియేటర్లో చూడాల్సిందే.
 
రాజప్ప పాత్ర మీకు ఎలా అనిపించింది ?
రాజప్ప పాత్రలో చాలా డెప్త్ వుంది. అలాంటి పాత్రలు నిజ జీవితంలో కూడా చూశాను. నేను చాలా పుస్తకాలు చదువుతాను. అలా చదివినప్పుడు ఎదో చోట రిఫరెన్స్ దొరుకుతుంది. రాజప్ప పాత్రలో సినిమా అంతా పవర్ ఫుల్ ఎమోషన్ క్యారీ చేస్తా. నటనకు ఆస్కారం వుండే అద్భుతమైన పాత్ర రాజప్ప. నితిన్ గారు అద్భుతమైన వ్యక్తి. ఆయన చాలా ఎనర్జీటిక్ పాజిటివ్. ఆయన కళ్ళల్లో చూసి కోపంగా డైలాగ్ చెప్పలేకపోయేవాడిని (నవ్వుతూ). ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని జ్ఞాపకం.
 
నిర్మాతలు గురించి?
నిర్మాత సుధాకర్ అద్భుతమైన వ్యక్తి. సెట్స్ లో ఆయన్ని చూస్తూనే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతిది చాలా కంఫర్ట్ బుల్ గా చూసుకున్నారు. ఈ చిత్రంలో మంచి టెక్నిషియన్స్ పని చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అద్భుతమైన కథతో వస్తున్న చిత్రమిది. ఫ్యామిలీ, కామెడీ, లవ్ స్టొరీని అన్నీ ఎలిమెంట్స్ వున్న ప్యాకేజీ ఇది. సినిమాపై పాజిటివ్ వైబ్ వుంది. ఖచ్చితంగా సినిమా విజయం సాధిస్తుంది.
 
నటుడిగా ఈ చిత్రం ఎంత తృప్తిని ఇచ్చింది ?
రాజప్ప పాత్రలో ఒక ఛాలెంజ్  వుంది. చాలా కష్టపడి చేశాను. అయితే స్క్రీన్ పై చూసుకునే సరికి కష్టం అంతా మరిచిపోయాను. సినిమా అద్భుతంగా వచ్చింది. ఒక నటుడిగా వందశాతం తృప్తిని ఇచ్చింది. కృతిశెట్టి తో పాటు చాలా మందినటీనటులు అద్భుతంగా నటించారు.
 
నితిన్ ఫెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ?
మాచర్లలో నితిన్ ఫెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ వుంటుంది. కొత్త నితిన్ ని చూస్తారు. నితిన్ నుండి ఒక కొత్త విశ్వరూపం బయటికి వస్తుంది. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేషాలు అద్భుతంగా వుంటాయి.
 
దర్శకుడు శేఖర్ గురించి ?
శేఖర్ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. అతను ఎడిటర్ కాబట్టి ఎంత కావాలో ఎంత తీయాలో ఫుల్ క్లారిటీతో ఈ సినిమాని తీశారు.
 
నితిన్ మీ దర్శకత్వంలో సినిమా చేస్తానని చెప్పారు కదా ?
మా సినిమా కచ్చితంగా వుంటుంది. రెండేళ్ళ క్రితమే మాట్లాడుకున్నాం. సరైన సమయం వచ్చినపుడు మా సినిమా ఖచ్చితంగా జరుగుతుంది.
 
గత వారం రెండు విజయాలు వచ్చాయి.. ఈ వారం మాచర్ల ఆ విజయాన్ని కొనసాగిస్తుందా ?
మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. సీతారామం, బింబిసారా రెండు సినిమాలు చూశాను. , బింబిసారా మాస్ అయితే, సీతారామం క్లాస్ ఎక్స్ ట్రార్డినరీ. మాచర్ల నియోజికవర్గం ఈ సక్సెస్ ని తప్పకుండా కొనసాగిస్తుంది. సినిమాని సిన్సియర్ గా చేశాం. ప్రేక్షకులు థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను.
 
నటుడిగా దర్శకుడిగా రచయితగా మీ ప్రయాణం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ?
నాకు రచన అంటే ప్రాణం. షూటింగ్ గ్యాప్ లో సమయం దొరికితే కార్వాన్ లో కూర్చుని రాసుకుంటా. రాసుకున్న కథలని బ్యాంకు లాకర్ లో పెతుకున్నట్లు దాచుకుంటా. నటుడిగా వున్నప్పుడు నా ద్రుష్టి కేవలం నటనపైనే వుంటుంది.
 
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?
చిరంజీవి గారి గాడ్ ఫాదర్, నాని గారి దసరా సినిమాలు చేస్తున్నా.