శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (19:08 IST)

అంతా ఫ్యాన్స్ కోసం.. జబర్దస్త్ షోలోకి సుడిగాలి సుధీర్ రీ-ఎంట్రీ

బుల్లితెర నటుడు, కమెడియన్, యాంకర్, మెజీషియన్ అయిన సుడిగాలి సుధీర్‏కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సుడిగాలి సుధీర్.. కొద్ది నెలలుగా ఈటీవీ జబర్ధస్త్‌కు దూరమై స్టార్ మా, జీ ఇలా ఇతర టీవీ ఛానల్స్‌లో షోలు చేస్తూ ప్రజలను మెప్పిస్తున్నారు. ఇక బుల్లితెర నాట సుధీర్, రష్మి జోడీకి యూత్‏లో తెగ ఫాలోయింగ్ ఉందనే విషయం కూడా తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ఓ వైపు బుల్లితెరపై అలరిస్తూనే మరోవైపు వెండితెరపై మెరుస్తున్నాడు సుధీర్. సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కమెడియన్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేపోయాడు. ఇక ఇప్పుడు గాలోడు సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. 
 
ఇదిలా ఉంటే.. సుధీర్ తిరిగి జబర్దస్త్ షోకు వస్తే బాగుంటుందని అతని ఫ్యాన్స్ అనేకసార్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సుధీర్ తాను జబర్దస్త్ షోలోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. దీంతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.