సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2022 (20:00 IST)

జాతీయ పార్టీగా మారిన తెరాస... సొంతగూటికి వచ్చిన నల్లాల ఓదేలు

nallala odelu family
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ఇపుడు జాతీయ పార్టీగా అవతరించింది. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించింది. దీంతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. 
 
మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌, తన సతీమణి భాగ్యలక్ష్మితో కలిసి ఓదెలు తెరాసలో చేరారు. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్‌ బీఆర్ఎస్ ప్రకటనకు ముందుకు ఓదెలు దంపతులు ప్రగతిభవన్‌కు చేరుకుని తెరాసలో చేరారు.
 
ఓదెలు గతంలో తెరాస ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. భాగ్యలక్ష్మి సైతం తెరాస నుంచే జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. కొన్ని నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరిన వారిద్దరూ.. ఈరోజు తిరిగి సొంతగూటికి చేరారు. తెరాసలో చేరికకు ముందు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.