సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 12 జూన్ 2017 (04:22 IST)

చరిత్రలో నాకూ కొన్ని పేజీలుంటాయన్నమాట.. సంబరపడ్డ ఆ పుష్పలత ఎవరు?

మలయాళీగా పుట్టి తెలుగు కుటుంబంలో మెట్టి తెలుగు టీవీ చానళ్లలో గత రెండు దశాబ్దాలకు పైగా అప్రతిహతంగా యాంకర్‌గా దూసుకెళుతున్న సుమ సంబరపడిపోయన ఘటన జరిగింది. దీనికి దువ్వాడ జగన్నాథమ్ చిత్ర ఆడియో వేడుక సాక్ష

మలయాళీగా పుట్టి తెలుగు కుటుంబంలో మెట్టి తెలుగు టీవీ చానళ్లలో గత రెండు దశాబ్దాలకు పైగా అప్రతిహతంగా యాంకర్‌గా దూసుకెళుతున్న సుమ సంబరపడిపోయన ఘటన జరిగింది. దీనికి దువ్వాడ జగన్నాథమ్ చిత్ర ఆడియో వేడుక సాక్షీభూతమైంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దువ్వాడ జగన్నాథమ్ చిత్ర ఆడియో వేడుక ఆదివారం శిల్ప కళా వేదికలో వైభవంగా జరిగింది. ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. దిల్‌ రాజు నిర్మాత. 
 
ఆడియో విడుదల సందర్భంగా యాంకర్‌గా వ్యవహరించిన సుమకు చిత్ర బృందం షాక్‌ ఇచ్చింది. ‘డీజే’ చిత్రంలోని ‘మెచ్చుకో..’  పాటను సుమ విడుదల చేయాలంటూ దర్శకుడు హరీష్‌ శంకర్‌, నిర్మాత దిల్‌రాజు కోరడంతో సుమ ఆశ్చర్యపోయారు.
 
ఇన్నేళ్లుగా యాంకర్ పాత్ర పోషిస్తున్నప్పటికీ తనకు కొత్తసినిమా ఆడియో పాటను రిలీజ్ చేసే అవకాశం ఎవరూ ఇవ్వలేదని, తాను కూడా అలాంటి అవకాశం వస్తుందని ఊహించనే లేదని సుమ చెప్పారు. తొలిసారి ఓ పాటను విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిందుకు ధన్యవాదాలంటూ స్టేజీ మీదే ఆనందపడ్డారు. 
 
దువ్వాడ జగన్నాథమ్ చిత్రం లోని పాటను విడుదల చేయడం ద్వారా చరిత్రలో తనకూ కొన్ని పేజీలుంటాయని సుమ అనడంతో వేడుకలో నవ్వులు పూశాయి.