ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 9 మార్చి 2021 (22:16 IST)

తిరుమలలో సందడి చేసిన సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, శ్రద్ధా శ్రీనాథ్

తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు సినీనటులు సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, శ్రద్థా శ్రీనాథ్. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎ1 సినిమా విజయం దిశగా వెళుతుండడంతో సినీ యూనిట్ తిరుమల శ్రీవారిని దర్సించుకుంది. 
 
అంతకుముందు సందీప్ కిషన్ తిరుమలలోని టిటిడికి చెందిన తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో సామాన్య భక్తుడిలాగా భోజనం చేశారు. స్నేహితులతో కలిసి భోజనం చేశారాయన. ఆలయ దర్సనం తరువాత మీడియాతో సందీప్ కిషన్ మాట్లాడుతూ తిరుపతితో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
 
ఎ1 ఎక్స్ ప్రెస్ చిత్రం విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను ఎక్కడికి వెళ్ళినా జనం గుర్తు పడుతున్నారని.. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు సందీప్ కిషన్ తెలిపారు.