గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (09:53 IST)

'మాటలకందని మహా విషాదం' : కృష్ణ ఇకలేరంటే నమ్మశక్యంగా లేదు.. చిరంజీవి

chiru - krishna
సూపర్ స్టార్ కృష్ణ మృతిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇది మాటలకందని మహా విషాదం అంటూ ఆయన తన సంతాప సందేశాన్ని తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"సూపర్ స్టార్ కృష్ణగారు మనల్ని వదిలి వెళ్ళిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి. ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం, వీటికలబోత కృష్ణ. 
 
అంటువంటి మహామనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణగారికి అశ్రు నివాళి. 
 
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ అసంఖ్యాకమైన ఆయన అభిమానులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేసుకుంటున్నాను" అని చిరంజీవి పేర్కొన్నారు.