శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 10 జులై 2019 (13:23 IST)

బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్? (Video)

అవును బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ వుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. నాగార్జున హోస్ట్‌గా త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3పై జర్నలిస్ట్, యాంకర్ శ్వేతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ సెలక్షన్ తేడాగా ఉందని కుండబద్ధలు కొట్టారు. ఏప్రిల్ నెలలో బిగ్ బాస్ షో నిర్వాహకులు తనకు ఫోన్ చేసి తమ రియాల్టీ షోకు సెలక్ట్ చేశామని చెప్పడంతో.. కలవాలని అడిగాకు. మా నుంచి రవికాంత్ అనే కో ఆర్టినేటర్ ఫోన్ చేశారని చెప్పారు. తన ఆఫీసుకు వచ్చి కలిశారు. తర్వాత ఈ షో చేయడానికి తాను సిద్ధమే అని చెప్పిన తర్వాత... ఊహించని, షాకింగ్ పరిణామాలు ఎదురయ్యాయని శ్వేతా రెడ్డి తెలిపారు. 
 
వచ్చిన వ్యక్తి అగ్రిమెంట్ తర్వాత మరో కో-ఆర్డినేటర్ మా బాస్‌ను మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు అని అడిగారని శ్వేతా రెడ్డి చెప్పుకొచ్చారు. మిమ్మల్ని తీసుకుంటే మాకేం లాభం అని కూడా అడిగారని.. బిగ్ బాస్ షో హిట్ అవ్వాలంటే మీరు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? ఎలాంటి యాక్టివిటీ ప్లే చేస్తారు అని శ్యాం అనే వ్యక్తి అడిగడంతో షాకయ్యానని చెప్పారు.
 
ఇది రియాల్టీ షో, భిన్నమైన మనస్తత్వం గల వారిని అందులోకి ప్రవేశ పెడతారు. అక్కడ ఇచ్చే టాస్కులను బట్టి మేము గేమ్ ఆడాల్సి ఉంటుంది. అంతే కానీ ముందుగానే ఏం చేస్తారు? అడగటం ఏమిటి..? అని శ్వేతారెడ్డి అడిగినట్లు తెలిపారు. దానికి ఆయన స్పందిస్తూ... అలా కాదండీ, మా బాస్‌ను మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు అన్నారు. 
 
మీ బాస్‌ను నేనుందుకు ఇంప్రెస్ చేయాలి? కమిట్మెంట్ అడుగుతున్నారా? మీ బాస్‌ను సాటిస్పై చేయడం అంటే అర్థం ఏమిటి? కమిట్మెంట్ అడుగుతున్నారా? ఒక జర్నలిస్టుగా తాను ఎంతో మందిని సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశాను. కమిట్మెంట్, కాస్టింగ్ కౌచ్ మీద డజన్ల కొద్దీ ఇంటర్వ్యూలు చేశానంటూ వారు అలాంటి ప్రశ్న అడిగిన తీరును శ్వేతా రెడ్డి తప్పుబట్టారు. 
 
యూట్యూబ్ ట్రెడింగ్ స్టార్ అని శ్వేతారెడ్డి అనే తనను అప్రోచ్ అయ్యారు. బిగ్ బాస్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యాక.. తామెందుకు ఇంప్రెజ్ చేయాలని శ్వేతారెడ్డి చెప్పారు. ఇంకేముంది..? శ్వేతారెడ్డి వ్యాఖ్యలను బట్టి బిగ్ బాస్‌ సెలక్షన్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ వుందని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది.