ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (10:43 IST)

సమంత.. తాప్సీ ఒకటైతే..?

samantha
నటి సమంత ప్రస్తుతం వరుస ఆఫర్లతో  దూసుకుపోతుంది. తాజాగా యశోద, ఖుషీ సినిమాలు సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. కాగా, ఇప్పుడామె నుంచి మరో కొత్త కబురు అందింది. నటి తాప్సీ నిర్మాణంలో ఓ ప్రాజెక్ట్‌ చేయనుంది. ఈ విషయాన్ని తాప్సీ ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
 
''సమంత నేను కలిసి పనిచేయనున్నాం. ఆ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రకటిస్తాం. అందులో తనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. నేను నిర్మాతగా వ్యవహరిస్తా. ఒకవేళ దాంట్లో నేను చేయగలిగే భాగం ఏదైనా ఉంటే కచ్చితంగా చేస్తాను. 
 
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ నిర్మించడం పట్ల ఉత్సాహంగా ఉన్నా'' అని తాప్సీ చెప్పింది. ప్రస్తుతం ఆమె 'శభాష్‌ మిథూ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది.