అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)
తమిళ సినీ దర్శకుడు అభిషన్ జీవంత్ తన ప్రియురాలికి ఓ వేదికపై నుంచి ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను డైరెక్ట్ చేసిన "టూరిస్ట్ ఫ్యామిలీ" సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆ చిత్ర దర్శకుడు అభిషన్ జీవంత్ ఎమోషనల్‌కు గురవుతూ తనతో పాటు ఆరో తరగతి నుంచి ప్రయాణం చేస్తున్న తన చిన్ననాటి స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు.
ఈ వేదికపై నుంచి తన స్నేహితురాలు అఖిలను ఒకటి అడగాలని అనుకుంటున్నట్టు చెప్పారు. "అఖిలా ఇళంగోవన్... ఆరో తరగతి నుంచి నీవు నాకు నాకు తెలుసు. మనమిద్దరం కలిసి కొనసాగుతున్నాం... ఈ సందర్భంగా నిన్ను ఒకటి అడుగుతున్నాను. అక్టోబరు 31వ తేదీన నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్ చేశాడు. నేను కష్టాల్లో ఉన్నపుడు నా వెంట వుండి వెన్నుతట్టి ప్రోత్సహించిన నా తల్లికి ఎంత పాత్ర ఉందో.. అఖిలకు కూడా అంతే పాత్ర ఉంది. ఈ ప్రశ్న వినగానే అదేకార్యక్రమంలో ఉన్న అఖిల కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.