మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 28 ఏప్రియల్ 2025 (23:14 IST)

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

HCL Tech
నోయిడా: భారతదేశంలో అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ HCL Tech యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యతా ఎజెండాను HCL Foundation  ప్రోత్సహిస్తుంది. సంస్థ ఇప్పుడు HCL Tech గ్రాంట్ యొక్క 2025 ఎడిషన్ యొక్క విజేతలను ఈ రోజు ప్రకటించింది. విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణంలో పరివర్తనాపరమైన మార్పును ప్రోత్సహించే నాన్-గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ (NGOలు)ను HCLTech గ్రాంట్ మద్దతు చేస్తుంది. ఈ ఏడాది, HCLTech గ్రాంట్ భారతదేశంవ్యాప్తంగా ఉన్న NGOల నుండి 13,925 రిజిస్ట్రేషన్స్‌ను స్వీకరించింది. ప్రతి శ్రేణిలో నుండి మూడు విజేత NGOలకు తమ ప్రభావితపరిచే ప్రాజెక్టుల కోసం రూ. 5 కోట్లు మరియు ప్రతి శ్రేణిలో ఆరు రన్నర్-అప్ NGOలకు రూ. 25 లక్షలు బహుకరించబడ్డాయి.
 
HCLTech గ్రాంట్ యొక్క 10వ ఎడిషన్ లో గెలిచిన NGOలు:
పర్యావరణం: పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ మరియు ఉత్తర 24 పరగణాలలోని 40 గ్రామాలలో సుస్థిరమైన వ్యవసాయం ప్రోత్సహించడం, స్థానిక జీవనోపాధులు మద్దతు చేయడం మరియు మహిళలకు సాధికారిత కల్పించే తమ ప్రాజెక్టు “జీవితం మరియు జీవనోపాధి కోసం జీవ వైవిధ్యత సంరక్షణ” కోసం లోకమాత రాణి రషమోణి మిషన్ కృషి చేసింది.
 
ఆరోగ్యం: తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ లలోని 10,000 గ్రామాల్లో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ (ROP) వలన బాల్యంలో కలిగే అంధత్వం నిర్మూలించడం పై దృష్టిసారించే  “విజన్ ఆఫ్ వీల్స్” ప్రాజెక్ట్ కోసం గురుప్రియ విజన్ రీసెర్చ్ ఫౌండేషన్ కృషి చేసింది.
 
విద్య: దేశవ్యాప్తంగా 38,400 గ్రామాల్లో స్పర్శనీయమైన వ్యవస్థలు ద్వారా విద్యను చేర్చడానికి దృష్టిసారించే “టచ్ లెర్న్ అండ్ షైన్” ప్రాజెక్టు కోసం రైజ్డ్ లైన్స్ ఫౌండేషన్ కృషి చేసింది.