బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (17:08 IST)

''పెళ్లిచూపులు'' తమిళ రీమేక్‌లో ప్రియదర్శి, తమన్నా విష్ణు విశాల్

''పెళ్లిచూపులు'' సినిమా తమిళంలో రీమేక్ కానుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక లో బడ్జెట్ సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ట‌యిన ''పెళ్లిచూపులు'' చిత్రంలో ప్రియ‌ద‌ర్శి పోషించిన కౌశిక్ పాత్ర సిన

''పెళ్లిచూపులు'' సినిమా తమిళంలో రీమేక్ కానుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక లో బడ్జెట్ సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ట‌యిన ''పెళ్లిచూపులు'' చిత్రంలో ప్రియ‌ద‌ర్శి పోషించిన కౌశిక్ పాత్ర సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే‌. ఇదే పాత్రను ఈ సినిమా త‌మిళ రీమేక్ ''పొన్ ఒండ్రు కండేన్‌''లోనూ ప్రియదర్శి పోషించనున్నట్లు సమాచారం. 
 
తెలంగాణ మాండ‌లికంలో డైలాగులను త‌న శైలిలో ప‌లుకుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ప్రియ‌ద‌ర్శి త‌మిళ ప్రేక్ష‌కుల‌ను కూడా ఆకట్టుకుంటాడని సినీ యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు స్పైడర్ చిత్రం ద్వారా ప్రియదర్శి చిత్ర సీమలో అడుగుపెట్టాడు. గౌత‌మ్ మీన‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో నాయిక‌గా త‌మ‌న్నా న‌టించ‌నుంది. 
 
విష్ణు విశాల్ హీరోగా న‌టించనున్నాడు. సెంథిల్ వీర‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమా షూటింగ్ నవంబరులో సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే తమన్నా, నాగచైతన్య జంటగా నటించిన 100% లవ్ సినిమా తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జీవీ ప్రకాష్ చైతూగా తమన్నా రోల్‌లో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే నటిస్తోంది.