ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (16:47 IST)

శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్‌లో ఉందా? లేదా? (Video)

నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్ తెలుగు చిత్రపరిశ్రమలో ఉందా లేదా అనే అంశాన్ని పక్కనబెడితే... అసలు ఒక సమస్య ఉత్పన్నమైతే దాన్ని గురించి ఆలోచించడం మరచిపోయారని సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్

నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్ తెలుగు చిత్రపరిశ్రమలో ఉందా లేదా అనే అంశాన్ని పక్కనబెడితే... అసలు ఒక సమస్య ఉత్పన్నమైతే దాన్ని గురించి ఆలోచించడం మరచిపోయారని సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. 'నా ఆలోచన' అనే యూట్యూబ్ చానెల్‌లో ఆయన మాట్లాడుతూ, నటి శ్రీరెడ్డికి 'మా' మెంబర్‌షిప్ ఇస్తారా? లేదా? అనేది వాళ్లిష్టమని, ఈ విషయమై ఎవరూ ప్రశ్నించేందుకు లేదన్నారు.
 
అంతేకాకుండా, 'ఫలానా వాళ్లతో కలిసి పనిచేయొద్దని చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఏ యూనియన్ కు, ఏ సంస్థకు ఉండదు. ఫండమెంటల్ రైట్ అది. నా ఇష్టం వచ్చిన వాళ్లతో నేను పని చేస్తాను.. మీ ఇష్టం వచ్చిన వాళ్లతో మీరు పని చేస్తారు. కానీ, 'మా' ఏ ధైర్యంతో ఆ మాట చెప్పిందో నాకు తెలియదు అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.