శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (16:21 IST)

శ్రీరెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయింది.. అర్ధనగ్న ప్రదర్శన ఎందుకు చేశావని అడిగితే?

శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తూ బడాబాబులు, నిర్మాతలు, దర్శకుల బండారాన్ని బయటపెడుతున్న ఈమె.. పక్కా ఆధారాలతో సహా సో

శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తూ బడాబాబులు, నిర్మాతలు, దర్శకుల బండారాన్ని బయటపెడుతున్న ఈమె.. పక్కా ఆధారాలతో సహా సోషల్ మీడియా, టీవీ చానెల్స్ వేదికగా బహిర్గతం చేస్తోంది. తాజాగా ఓ టీవీ లైవ్ కార్యక్రమంలో శ్రీరెడ్డి తనకు మద్దతిస్తూ.. ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తల్లి పుష్పవతి మాటలు విని బోరున ఏడ్చేసింది. 
 
చిన్నప్పటి నుంచి తన మాటపైనే వుండాలనుకునే మనస్తత్వం. తానింతేనని.. ఎవరేం చెప్పినా పట్టించుకునేది కాదు. ఆధ్యాత్మిక కుటుంబం నుంచి వచ్చిన శ్రీరెడ్డి చాలా మంచిగా పూజలు చేసేది. తొలుత టీవీ ఛానల్స్‌ వెళ్తానంటే ఓకే అన్నాం. సినిమాలకు వెళ్తానంటే వెళ్ళొద్దన్నాం. కానీ చెప్పకుండా సినిమాల్లోకి వెళ్లిపోయింది.
 
ఏం చెప్పినా తల్లిదండ్రులు బిడ్డ బాగు కోసం అడ్డుపడతామని సినిమాల్లో వెళ్తున్న విషయాన్ని దాచేసింది. అర్ధనగ్న ప్రదర్శన ఎందుకు చేశావని బాధతో అడిగితే తాను చనిపోయాననుకోండి అంటూ శ్రీరెడ్డి చెప్పింది. మా బిడ్డ చేస్తున్న పని ధర్మం అయితే మాకు సమ్మతమే. ఒత్తిడిలో అలా చేసినట్లు శ్రీరెడ్డి చెప్పిందని.. ఆమె తల్లి పుష్పవతి వెల్లడించింది. తల్లి మాటలు విని శ్రీరెడ్డి బోరున ఏడ్చేసింది.  
 
మాకు ఇలాంటివి పడవు. ఏ తల్లీ వినకూడని మాటలు మేం వినాల్సి వస్తోంది. శ్రీ విషయంలో చాలా ఫీలవుతున్నా. పదేళ్ల క్రితమే ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పడప్పుడు ఇంటికి వచ్చేది కానీ.. గత ఐదేళ్లుగా అస్సలు ఇంటికి రావట్లేదు. ఆ అమ్మాయికీ మాకు ఎలాంటి సంబంధమూ లేదు. కొద్ది రోజుల తర్వాత సాక్షి టీవీలో కనిపించింది. తర్వాత బాగుండేది. తాము హైదరాబాద్ వెళ్లేవాళ్లమంటూ పుష్పవతి చెప్పింది. 
 
కానీ ఎన్నోసార్లు ఇలా చేయొద్దమ్మా అని చెప్పినా.. తాను చచ్చినా పర్లేదు కానీ న్యాయం జరగాలని శ్రీరెడ్డి చెప్పేదని పుష్పవతి వెల్లడించింది. ఇండస్ట్రీలో చాలా అన్యాయం జరుగుతోంది.. అవన్నీ మీకు తెలియవు.. నేను అనుభవించాను గనుక తెల్సు. ఇవన్నీ బయటపెట్టాలని శ్రీరెడ్డి చెప్పేదని, శ్రీరెడ్డి చేసే పోరాటం వల్ల పదిమందికి మంచి జరుగుతుందంటే మాత్రం మాకు ఎలాంటి అభ్యంతరం లేదని పుష్పవతి తెలిపింది.