శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (09:43 IST)

వాగ్ధేవికి తెలుగు ఇండియన్ ఐడల్ అవార్డు: గాడ్ ఫాదర్‌లో పాడే ఛాన్స్!

BVK Vagdevi
BVK Vagdevi
తెలుగు ఇండియన్ ఐడల్ అవార్డు వాగ్దేవి వరించింది. సంగీత సమరంలో వాగ్ధేవి విజేతగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా వాగ్దేవి ట్రోఫీని అందుకొని మొట్ట మొదటి తెలుగు ఇండియన్ ఐడల్‌గా చరిత్ర సృష్టించింది. 
 
15 వారాల సుదీర్ఘ సంగీత ప్రయాణం తర్వాత ఆహా ఈ జూన్ 17న ఫినాలే టెలికాస్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు, రానా దగ్గుబాటి, సాయి పల్లవి కూడా విచ్చేసి గ్రాండ్ ఫినాలేను కన్నుల పండుగగా మార్చేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవికి ట్రోఫీ తో పాటు 10 లక్షల బహుమానం, గీత ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాడే అవకాశం కూడా వచ్చింది.
 
మొదటి రన్నరప్ శ్రీనివాస్‌కు 3 లక్షలు, రెండో రన్నరప్ వైష్ణవికి 2 లక్షల బహుమానం ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారు వైష్ణవి పాటకు మంత్రముగ్ధులయ్యి, తన తర్వాత సినిమా గాడ్ ఫాదర్‌లో పాడే అవకాశం ఇచ్చారు. ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షో తెలుగులో మొట్ట మొదటి సారిగా ఆహా తీసుకురావడం జరిగింది. ఈ షో కి యాంకర్‌గా శ్రీరామ చంద్ర నిర్వహించంగా, న్యాయనిర్ణేతలుగా తమన్, నిత్య మీనన్, కార్తీక్ ఈ షో ని తమ భుజాల మీద వేసుకొని ముందుకు నడిపారు.
 
ఈ షో విన్నర్ వాగ్దేవి మాట్లాడుతూ, టైటిల్ గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఎంతో మంది దిగ్గజాల ముందు పాడాను. ఈరోజు చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుండి ఎన్నో జ్ఞాపకాలతో పాటు సంగీత జ్ఞానాన్ని కూడా నేను తీసుకొని వెళుతున్నాను. అందుకు నేను తెలుగు ఇండియన్ ఐడల్ మరియు ఆహా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపింది.