ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (17:11 IST)

ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారు..

Samantha
ఫోన్ ట్యాపింగ్ వల్లే టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య విడిపోయారట. సమంత, చైతూ విడాకులకు కారణం ఈ ఫోన్‌ ట్యాపింగే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నేత సమంత ఫోన్ ట్యాప్ చేశారని తెలుస్తోంది. 
 
పైగా సదరు నేత కేవలం రాజకీయాలు మాత్రమే కాకుండా.. మందుల వ్యాపారం కూడా చేస్తున్నారని మల్లన్న అన్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అన్నారు. 
 
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. కాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఫోన్లు ట్యాప్‌ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.