శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 20 మార్చి 2024 (09:39 IST)

ఎవరి అందం గొప్ప? సమంత-తమన్నా గ్లామర్ ఫోటోలతో యుద్ధం

Tamannah-Samantha
కర్టెసి-ట్విట్టర్
ఎవరి ఫేవర్ స్టార్ వారికే గొప్ప. ఐతే అప్పుడప్పుడు ఫ్యాన్స్ మా హీరోయిన్ గొప్ప అంటే మా హీరోయిన్ గొప్ప అంటూ వాదనలకు దిగుతుంటారు. ఈ విషయంలో కొన్నిసార్లు పోరు మరీ తారాస్థాయికి వెళుతుంటుంది. మరీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచి చెప్పాల్సింది చిటికెలో చెప్పేస్తున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా తమన్నా-సమంత ఇద్దరూ బాలీవుడ్ ఈవెంట్ కి హాజరయ్యారు. అక్కడ వారు ప్రదర్శించిన గ్లామర్ దెబ్బకు వారివారి ఫ్యాన్స్ ఫ్లాటైపోయారు. నిన్నటి నుంచి ఫ్యాన్స్ తమ అభిమాన హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మా హీరోయిన్ సూపర్ అంటే మా హీరోయిన్ అద్భుతమైన అందగత్తె అంటూ పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. సమంత-తమన్నా ఇద్దరిలో అందగత్తె ఎవరన్నది పక్కనపెడితే వీరిద్దరూ మాత్రం ఫంక్షన్లో పాల్గొన్న తర్వాత కలుసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసారు.