శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మార్చి 2024 (11:11 IST)

తమన్నా భాటియా- విజయ్ వర్మ సహజీవనం.. పెళ్లి ఎప్పుడంటే?

tamannah - vijay varma
తమన్నా భాటియా- విజయ్ వర్మ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రెస్టారెంట్‌ల నుంచి, ఈవెంట్ల నుంచి ఈ జంట తీసుకున్న ఫోటోలు నెట్టింట చక్కర్ల కొడుతున్నాయి. వీరిద్దరి వివాహం త్వరలో జరుగబోతున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే తమన్నా- విజయ్ వర్మ తమ వివాహ సన్నాహాల గురించి చర్చించడానికి నిరాకరించారు. అయినప్పటికీ, వారు ఇప్పటికే సహజీవనం చేయడం ప్రారంభించారని బిటౌన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
 
చాలామంది బాలీవుడ్ జంటలు ఈ ట్రెండ్‌ను అనుసరించడంతో.. త్వరలో ఈ జంట కూడా వివాహం చేసుకుంటుందని టాక్ వస్తోంది. తమన్నా కొత్త చిత్రాలకు సైన్ చేస్తూనే ఉంది. ఆమె తన రాబోయే తెలుగు చిత్రం "ఒడెలా 2" పై ఇప్పటికే నిర్మాణాన్ని ప్రారంభించింది.