గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (17:37 IST)

'బాహుబలి-2 ఎలా ప్రశంసించినా సరిపోదు.. హ్యాట్సాఫ్ రాజమౌళి సర్'.. సూర్య : తొలి స్టార్ ప్రభాస్..

"బాహుబలి 2" చిత్రంపై తమిళ నటుడు సూర్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన తన స్పందనను తెలియజేస్తూ... "ఈ చిత్రం ఓ చక్కటి అనుభూతినిచ్చింది. ఈ చిత్రాన్ని అస‌లు ఏ విధంగా ప్రశంసించినా సరి

"బాహుబలి 2" చిత్రంపై తమిళ నటుడు సూర్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన తన స్పందనను తెలియజేస్తూ... "ఈ చిత్రం ఓ చక్కటి అనుభూతినిచ్చింది. ఈ చిత్రాన్ని అస‌లు ఏ విధంగా ప్రశంసించినా సరిపోదు. రాజమౌళి సర్‌ మన చిత్ర పరిశ్రమకు చక్కటి స్ఫూర్తినిచ్చారు. అదిరిపోయింది! హ్యాట్సాఫ్‌... బాహుబలి 2" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన‌ రాజమౌళి కూడా సూర్యకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 
ఇదిలావుండగా, సినీనటుడు ప్రభాస్ అభిమానుల‌కు కొన్ని నెల‌ల క్రితం మేడ‌మ్ టుస్సాడ్స్ బిగ్ న్యూస్ చెప్పిన విష‌యం తెలిసిందే. బ్యాంకాక్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ విగ్రహం చూడొచ్చ‌ని అప్ప‌ట్లో టుస్సాడ్స్ ప్ర‌క‌టించింది. అందుకోసం హైద‌రాబాద్‌లో ప్ర‌భాస్ ఫొటోలు, కొల‌త‌లు కూడా తీసుకున్నారు.
 
అయితే, ప్ర‌భాస్ మామూలుగా బ‌య‌ట‌ క‌నిపించేటట్లు కాకుండా బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్ ఎలా క‌నిపించాడో అలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ప్రభాస్‌ ‘బాహుబలి’ గెటప్‌లో అక్క‌డే ఉన్నారా? అనేలా చాలా చక్కగా ఆయ‌న‌ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అంతేకాదు ‘బాహుబలి: ది బిగినింగ్‌’ క్లైమాక్స్‌లోని ఓ సన్నివేశాన్ని తలపించేలా విగ్రహం పరిసరాల్ని డిజైన్ చేశారు. ఈ మ్యూజియంలో చోటు సంపాదించుకున్న ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న‌ మొట్ట‌మొద‌టి సౌత్ ఇండియ‌న్ స్టార్‌గా ప్రభాస్ కీర్తికెక్కాడు.