మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 31 మే 2016 (11:40 IST)

తైవాన్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'బాహుబలి ది బిగినింగ్'

ప్ర‌పంచ వ్యాప్తంగా ''బాహుబ‌లి'' ది బిగినింగ్ పలు రికార్డులను సృష్టించింది. బాక్పాఫీస్ వ‌ద్ద రూ.600 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి భారత సినిమా రికార్డుల‌ను సైతం తిర‌గ‌రాసిన చిత్రంగా పేరు సంపాదించుకుంది. అంతేగాకుండా అంత‌ర్జాతీయ స్థాయి ఫిలిం ఫెస్టివ‌ల్ ప్ర‌ద‌ర్శిత‌మై విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలందుకుంది. తూర్పు చైనాకు చెందిన తైవాన్ దీవిలో బాహుబ‌లి రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌భాస్ ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. 
 
కాగా మే 13 న తైవాన్‌లో రిలీజైన చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ముందుకు దూసుకెళుతుంది. రెండు వారాలు పూర్తయి మూడో వారంలోకి అడుగు పెట్టినప్పటికీ భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే‌లోని పలు భాషల్లో 'బాహుబలి' రిలీజ్ అయి మంచి విజయాన్నిసొంతం చేసుకోగా ఇప్పుడు తైవాన్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో బాహుబలి టీంకి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.