సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (12:15 IST)

శివలింగంపై నుంచి రక్తం కారుతుండగా.. కోపంతో చూస్తున్న 'బాహుబలి; ట్రైలర్ శాంపిల్ (Video)

ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'బాహుబలి-2 : ది కంక్లూషన్'. ఈ చిత్రం ట్రైలర్ శాంపిల్‌ను ఆ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సోమవారం ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'బాహుబలి-2 : ది కంక్లూషన్'. ఈ చిత్రం ట్రైలర్ శాంపిల్‌ను ఆ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సోమవారం ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేశారు. వాస్తవానికి ఈనెల 16వ తేదీ ఈ చిత్రం పూర్తి ట్రైలర్ విడుదలకానుంది. 
 
అయితే, సోమవారం 3 సెకన్ల నిడివి కలిగిన ఓ శాంపిల్ ట్రైలర్‌ను ఆయన యూట్యూబ్‌లో పెట్టారు. ఇందులో ఓ శివలింగంపై నుంచి రక్తం కారుతుండగా, ఆ పక్కనే రక్తమోడుతూ, కోపంతో చూస్తున్న బాహుబలి (ప్రభాస్)ని చూపించారు. 
 
తలకు తగిలిన దెబ్బ, ముక్కు నుంచి రక్తం కారుతున్న స్థితిలోనూ కళ్లల్లో తీక్షణత ఏ మాత్రం తగ్గకుండా కనిపిస్తున్న బాహుబలి మూడు సెకన్ల వీడియో సైతం వైరల్ అవుతోంది. ఈ ఉదయం 10:30కి రాజమౌళి ఈ ట్వీట్ చేయగా, ఇప్పటికే వీడియోను 41 వేల మంది చూశారు.