సర్దార్ గబ్బర్ సింగ్ పాటకు లేచి నిలబడి చప్పట్లు కొట్టిన జెన్నిఫర్ లోపెజ్ (Video)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సర్దార్ గబ్బర్ సింగ్ సీక్వెల్‌గా వచ్చింది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినా.. పాటలు మాత్రం హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు చెందిన పాటకు అంతర్జాతీయ డ్యాన్సింగ్ సెన్సేషన్, సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ ముగ్దురాలైంది. ఎలాగంటే.. ఇంటర్నేషనల్ రియాల్టీ షోలో భారత గ్రూప్ 'ద కింగ్స్' అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఈ షోకు న్యాయనిర్ణేతగా జెన్నిఫర్ లోపెజ్ హాజరైంది.
ఈ షోలో భారత్ నుంచి ముంబయి కుర్రాళ్లతో కూడిన ద కింగ్స్ అనే గ్రూప్ కూడా పాల్గొంది. ఈ షో ఫినాలో భాగంగ 'ద కింగ్స్' సర్దార్ గబ్బర్ సింగ్‌లోని 'వాడెవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డెవరన్నా' అనే పాటకు '300' సినిమా కాన్సెప్ట్‌ను మిక్స్ చేసి అదిరిపోయే రీతిలో పెర్ఫామ్ చేసింది.
స్టేజ్ డ్యాన్స్ అయినా ఆ పాటలో 'ద కింగ్స్' బృందం ప్రదర్శించిన థ్రిల్స్, నాట్య విన్యాసాలు చూసి జెన్నిఫర్ లోపెజ్ ముగ్దురాలైంది. ఈ క్రమంలో ఆమె లేచి నిలబడి టీమ్‌ను చప్పట్లు కొట్టి అభినందించింది.