మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (10:09 IST)

శనివారం రాత్రి దుబాయ్ హోటల్ గదిలో ఏం జరిగిందంటే...

తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్ వెళ్లిన నటి శ్రీదేవి అదే హోటల్ బాత్రూమ్‌లో గుండెపోటుతో మరణించింది. ఈ వివాహం కోసం తొలుత తన భర్త బోనీ కపూర్, చిన్న కుమార్తెతో కలిసి దుబాయ్‌కు శ్రీదేవి వారం

తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్ వెళ్లిన నటి శ్రీదేవి అదే హోటల్ బాత్రూమ్‌లో గుండెపోటుతో మరణించింది. ఈ వివాహం కోసం తొలుత తన భర్త బోనీ కపూర్, చిన్న కుమార్తెతో కలిసి దుబాయ్‌కు శ్రీదేవి వారం రోజులు ముందుగానే వెళ్లింది. దుబాయ్‌లో జుమైరా ఎమిరేట్స్ హోట‌ల్‌లో బసచేసింది. భ‌ర్త బోనీ క‌పూర్ వ్యక్తిగత పనుల మీద స్వదేశానికి వచ్చి మళ్లీ శ‌నివారం మ‌ధ్యాహ్నం దుబాయ్‌కు వెళ్లాడు.
 
అక్కడకు వెళ్లాక శ్రీదేవిని స‌ర్‌ప్రైజ్ చేయాల‌నుకున్నాడు. ఆమెకు శనివారం రాత్రి డిన్న‌ర్ పార్టీ ఇవ్వాల‌నుకున్నాడు. సాయంత్రం 5.30 ప్రాంతంలో బోనీ క‌పూర్... హోట‌ల్‌లో నిద్రిస్తున్న శ్రీదేవిని లేపాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ఓ 15 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఇక స‌ర్‌ప్రైజ్ పార్టీ కోసం త‌యార‌య్యేందుకు శ్రీదేవి వాష్‌రూమ్‌కు వెళ్లింది. కానీ 15 నిమిషాలు దాటినా ఆమె బ‌య‌ట‌కు రాలేదు. దీంతో బోనీ క‌పూర్ వాష్‌రూమ్‌కు వెళ్లి పలుకరించే ప్రయత్నం చేయగా, ఆమె వైపు నుంచి స్పందన లేదు. అనుమానంతో బోనీ క‌పూర్ త‌లుపుల‌ను గ‌ట్టిగా తీసి చూశాడు. 
 
శ్రీదేవి వాష్‌రూమ్‌లో ఉన్న బాత్‌ట‌బ్‌లో చ‌ల‌నంలేని స్థితిలో ప‌డివుండటం, ఎంత‌కీ స్పందించ‌క‌పోవ‌డంతో బోనీ క‌పూర్ ఆమెను మేల్కొల్పే ప్ర‌య‌త్నం చేశాడు. అయినా శ్రీదేవిలో స్పంద‌నలేదు. దాంతో బోనీ క‌పూర్ త‌న స్నేహితుడు ఫోన్ చేసి.. సుమారు రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో పోలీసుల‌కు ఫోన్ చేసి స‌మాచారం అంద‌జేశాడు. పోలీసులు, పారామెడిక్స్ సిబ్బంది హోట‌ల్‌కు చేరుకుని ఆస్పత్రికి తరలించారు. 
 
ఆమె పరీక్షించిన వైద్యులు.. అప్పటికే శ్రీదేవి చనిపోయినట్టు నిర్ధారించారు. దీంతో బోనీ కపూర్ శోకసముద్రంలో మునిగిపోయాడు. నిజానికి వారం క్రితం పెళ్లికి వెళ్లి తిరిగి భారత్‌కు వ‌చ్చిన బోనీ క‌పూర్‌.. శ‌నివారం భార్య శ్రీదేవిని స‌ర్‌ప్రైజ్ చేసేందుకు మ‌ళ్లీ దుబాయ్ వెళ్లాడు. కానీ భర్త డ్రీమ్ డిన్న‌ర్ అందుకోకుండానే లేడీ సూపర్ స్టార్ కన్నుమూసింది.