గురువారం, 16 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (20:50 IST)

ఓ మంచి మనిషీ మళ్ళీ పుట్టవా : నటి శారద

సినీ నటి శ్రీదేవి మరణంపై సీనియర్ నటి శారద స్పందించారు. ఓ మంచి మనిషీ మళ్లీ పుట్టవా అంటున్నారు. ముఖ్యంగా, శ్రీదేవి మరణవార్త తనను షాక్‌కు గురిచేసినట్టు చెప్పారు. ఆమెలాంటి మంచి మనిషి ఇక పుట్టరనీ, అందుకే ఆ

సినీ నటి శ్రీదేవి మరణంపై సీనియర్ నటి శారద స్పందించారు. ఓ మంచి మనిషీ మళ్లీ పుట్టవా అంటున్నారు. ముఖ్యంగా, శ్రీదేవి మరణవార్త తనను షాక్‌కు గురిచేసినట్టు చెప్పారు. ఆమెలాంటి మంచి మనిషి ఇక పుట్టరనీ, అందుకే ఆమే మళ్లీ వచ్చే జన్మలో పుట్టాలంటూ శారదా కోరారు. 
 
ఇకపోతే, మరో సీనియర్ నటి జయప్రద స్పందిస్తూ, అతిలోకసుందరి శ్రీదేవి మరణం ఒక చెడు కలలాంటిదన్నారు. శ్రీదేవి మరణించిందన్నవార్తను టీవీల్లో చూసేవరకు తను విశ్వసించలేదని చెప్పారు. తనూ, శ్రీదేవి చాలా చిత్రాల్లో కలిసి పనిచేశామన్నారు. 
 
శ్రీదేవి అద్భుతమైన నటి, తల్లి అని అన్నారు. కుమార్తెలు, జాన్వి, ఖుషి కూడా వెండితెరపై రాణిస్తే చూడాలన్నది శ్రీదేవి కల అని చెప్పారు. కానీ జాన్వి తన తల్లిని ఆఖరి క్షణాల్లో కలవలేకపోయిందని జయప్రద తెలిపారు.