శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (09:57 IST)

చివరి కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిన 'అతిలోక సుందరి'

తన కుమార్తెను వెండితెరపై చూసి మురిసిపోవాలనుకున్న వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి.. చివరకు ఆ కోరిక తీరకుండానే దివికేగింది. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి... గుండెపో

తన కుమార్తెను వెండితెరపై చూసి మురిసిపోవాలనుకున్న వెండితెర 'అతిలోక సుందరి' శ్రీదేవి.. చివరకు ఆ కోరిక తీరకుండానే దివికేగింది. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి... గుండెపోటు హఠాన్మరణం చెందారు. దీంతో బోనీ కపూర్ కుటుంబం ఒక్కసారి షాక్‌కు గురైంది. భర్త బోనీ కపూర్‌కు ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా వుండే శ్రీదేవి ఒక్కసారిగా దూరంకావడంతో ఆయన దిక్కులేని మనిషిగా మారిపోయాడు. 
 
అయితే, 54 యేళ్ల శ్రీదేవి... 42 యేళ్ళ పాటు వెండితెరపై రాణించింది. బాలనటి నుంచి హీరోయిన్‌గా రాణించి, ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంది. అలాగే, ఆమె పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్‌ను కూడా వెండితెరపై హీరోయిన్‌గా చూసి మురిసిపోవాలనుకుంది. జాహ్నవి నటిస్తున్న తొలి సినిమా 'ధడక్' మరో రెండు - మూడు నెలల్లో విడుదలకానుంది. అయితే తన కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన శ్రీదేవి తన కూతురిని వెండితెర మీద చూడకుండానే మృతి చెందింది.