మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 10 మార్చి 2021 (19:26 IST)

ఎదపై అందుకే టాటూ, మూడో చోట కూడా వేయించుకుంటా కానీ చెప్పను (video)

ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
ఆ రెండు చోట్ల టాటూ అందుకే వేయించుకున్నా, మూడో చోట కూడా వేయించుకుంటా కానీ చెప్పను అంటోంది నటి, యాంకర్ అనసూయ. యాంకర్ అనసూయ. ఆమెని చూడగానే చటుక్కున ఆమె మణికట్టుపై ఓ టాటూ, ఎదపై మరో టాటూ కనబడుతుంటాయి. ఈ టాటూలు ఎందుకు వేయించుకున్నదో చానాళ్లగా సస్పెన్సుగానే మిగిలిపోయి వుంది.
 
ఆమె అభిమానులు కూడా ఆ టాటూలు గురించి అడగలేదు. పైగా ఎదపై టాటూ ఏంటని అడిగితే ఏమంటుందో అని భయపడి వదిలేశారు. ఐతే తాజాగా ఆమె తన యూ ట్యూబ్ ఛానల్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పేసింది. పనిలో పనిగా ఒకరు టాటూలు గురించి అడిగే ధైర్యం చేసారు.
 
తన భర్త ప్రియుడుగా వున్న రోజుల్లో తన నిశ్చితార్థం జరిగే ముందు ఇక ఎప్పటికీ గుర్తుండిపోవాలని నిక్కూ అని ఎదపై టాటూ వేయించుకున్నదట. మణికట్టుపై టాటూ గురించి చెపుతూ... కలన్ అని వేయించుకున్నాననీ, దాని అర్థం ఇన్నర్ బ్యూటీ గ్రేట్ అని చెప్పింది. ఐతే మూడో టాటూ కూడా వేయించుకుంటానని చెప్పింది అనసూయ. ఐతే అది ఎందుకు వేయించుకోవాలనుకుంటుందో చెప్పలేదు మరి. వేయించుకున్నాక చెప్తుందేమో?