సోమవారం, 16 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (17:53 IST)

నిర్మల్, అదిలాబాద్, వరంగల్ లో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి : వేణుగోపాల చారి

Nihan, Vaishnavi
Nihan, Vaishnavi
నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై  రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు.
 
మాజీ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల చారి మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజా రెడ్డిని గుర్తుకు చేసేలా ఉంటుంది. ఆయన అంచలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో నటించిన వాళ్లు సాంకేతిక నిపుణులు అందరూ నిర్మల్ ప్రాంతం వాళ్ళు రావడం నిజంగా ఆనందదాయకం. నేడు తెలంగాణలో నిర్మల్, అదిలాబాద్, వరంగల్ లాంటి ప్రదేశాల్లో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అటవీ ప్రాంత లోకేషన్లు మన దగ్గర ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఈ సినిమాని నిర్మల్ ప్రాంతం వాళ్ళు నిర్మించడం, నటించడం చాలా శుభ పరిణామం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
నిర్మాత వెంకటరమణ మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి సినిమాని నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. ప్రేక్షకుల ఆశీస్సులు మాపై ఉండాలి ఈ సినిమా మన సక్సెస్ చెయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరో నిహాన్ మాట్లాడుతూ,  ఈ సినిమాను ప్రేక్షకులు చూసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ,  కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.