సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 31 మే 2022 (19:12 IST)

అన‌సూయ‌లో మ‌రో కోణం దాగివుంది

Anasuya pooja
Anasuya pooja
యాంక‌ర్‌, న‌టి అన‌సూయ సినిమాల్లోనూ టీవీ షోల్లో గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంది. బ‌య‌ట ఆమెకు మ‌రో కోణం వుందట‌.  వ్య‌క్తిగ‌తం ఆమె చాలా రూల్స్ పెట్టుకుంటుంద‌ట‌. రోజువారీ క‌స‌ర‌త్తులు, యోగా, అవ‌స‌ర‌మైతే స్విమ్మింగ్ చేసే అన‌సూయ‌కు పూజ‌లు చేయ‌డం ఇష్ట‌మట‌. ఈ విష‌యాన్ని ఆమె ధృవీకరిస్తూ పోస్ట్ చేసింది. త‌న ఇంటిలోనూ కుటుంబ‌స‌భ్యుల‌తో చేసే పూజ‌కు సంబంధించిన ఫొటోను పెట్టిండి. మ‌హిళ‌లు చేసే ఈ పూజ ప‌సుపు కుంకుమ‌లు ప‌దికాలాల‌పాటు వుండాల‌ని చేస్తుంటారు.
 
Anasuya pooja
Anasuya pooja
నేను సమయం దొరికినప్పుడల్లా సాంస్కృతిక విశ్వాసాలు మరియు అభ్యాసాలకు కనెక్ట్ అయినప్పుడు ఇది నాకు చాలా బలాన్ని మరియు సానుకూల ప్రకంపనలను ఇస్తుంది.. నా మనస్సు మరియు ఆత్మను విస్తృతం చేస్తుంది. అని త‌న పూజ గురించి చెబుతోంది. మ‌హిళ‌లు చేసే వట సావిత్రి పూజ చేస్తూ త‌ను ఆన‌దిస్తున్న‌ట్లు చెబుతోంది. అందుకే వట సావిత్రి పూజ శుభకాంక్షలు అంటూ తెలిపింది.