బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (09:03 IST)

ఓ హీరోయిన్‌ను డేటింగ్‌కు పిలిస్తే ఆమె ఏం చెప్పిందో తెలుసా? జవాన్

మెగా హీరో, సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సిని

మెగా హీరో, సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్, త‌మిళ ఆర్టిస్ట్ ప్ర‌స‌న్నల పాత్రలే ఈ సినిమాకి హైలైట్ కానున్నాయి. డిసెంబ‌ర్ 1న విడుదల కానున్న ‘జ‌వాన్’ చిత్రం సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యూ/ఏ స‌ర్టిఫికెట్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకు ముస్తాబవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర అంశాలు తెలిపాడు. పనిలో పనిగా తన వ్యక్తిగత వివరాలను కూడా చెప్పుకొచ్చాడు. అమ్మాయిలతో ప్రేమలో పడేందుకు మా కాలనీలో ఓ ఫిగర్ కూడా లేదన్నారు. అలాగే డేటింగ్‌పై మాట్లాడుతూ.. ఇంతవరకు ఒక్క హీరోయిన్ కూడా తనను డేటింగ్ పిలవలేదన్నాడు. 
 
కానీ తానే ఓ హీరోయిన్‌ను డేటింగ్‌కు రమ్మని పిలిస్తే.. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను అడిగి చెబుతానని తెలిపిందన్నాడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. తిక్క చిత్రంలో నటించిన  లారిస్సా బోనేసి అని జవాన్ ఓపెన్‌గా చెప్పేశాడు.