గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (12:36 IST)

ఎఫ్‌3 ఫ్యామిలీ ఇదే. ఇక న‌వ్వులు షురూ అంటున్న అనిల్ రావిపూడి

F3, Venktesh, Tamanna, Anil
ఎఫ్‌2 సినిమా త‌ర్వాత ఇప్పుడు ఎఫ్‌3తో మ‌రింత‌గా న‌వ్వించేందుకు అనిల్ రావిపూడి ప్ర‌య‌త్నిస్తున్నాడు. వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ నాయ‌కానాయిక‌లు. ఈ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న వ‌స్తున్న ఈ సినిమా గురించి కుటుంబ స‌న్నివేశాల‌ను హైద‌రాబాద్‌లో ఓ స్టూడియోలో చిత్రీక‌రిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోను ద‌ర్శ‌కుడు అనిల్ పోస్ట్ చేశాడు. ఇందులో ముద్ద‌మందారం ఫేమ్ ప్ర‌దీప్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌, జ‌య‌ల‌లిత‌, ర‌ఘుబాబు, నిర్మాత శిరీష్ త‌దిత‌రులు వున్నారు. మేమంతా ఫ్యామిలీగా వుంటున్న‌ట్లు ఆయ‌న తెలియ‌జేస్తున్నాడు. కుటుంబ స‌న్నివేశాలు చాలా స‌ర‌దాగా సాగుతున్నాయ‌ని ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేస్తాయ‌ని అనిల్ తెలియ‌జేస్తున్నాడు.

కాగా, ప్ర‌దీప్ చాలా కాలం త‌ర్వాత కుటుంబ క‌థా చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడుని చూస్తుంటే నేను మంచి ఫామ్‌లో వున్న‌ప్పుడు మా గురువుగారు జంథ్యాల గారు గుర్తుకు వ‌స్తున్నాడు. ఎక్క‌డా డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా చ‌క్క‌టి కుటుంబ‌క‌థా చిత్రాన్ని తీస్తున్నాడ‌ని ప్ర‌దీప్ సోష‌ల్‌మీడియాలో తెలియ‌జేస్తున్నాడు.  ఎఫ్3 సినిమా అన్ని కార్య్ర‌క‌మాలు పూర్తిచేసుకుని ఆగ‌స్టు 27న సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.