శుక్రవారం, 1 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (15:17 IST)

రవితేజ, శ్రీలీల న‌టించిన ధమాకా ప్రోగ్రెస్ ఏమంటే!

Ravi Teja, Srileela
Ravi Teja, Srileela
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాధరావు నక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా' పాజిటివ్ వైబ్స్ తో దూసుకెళుతోంది. రవితేజ మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న 'ధమాకా'లో డాషింగ్ క్యారెక్టర్‌లో అలరించనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.
 
రవితేజ, శ్రీలీల యొక్క అద్భుతమైన కెమిస్ట్రీని చూపించే రొమాంటిక్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. సినిమా మొదటి రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అక్టోబర్ 21, ఉదయం 10:01 గంటలకు మాస్ క్రాకర్ (టీజర్)ని విడుదల చేయనున్నారు. టీజర్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రెండు వేర్వేరు పోస్టర్లను విడుదల చేశారు. ఒక పోస్టర్ రొమాంటిక్ సైడ్ అయితే, మరొకటి యాక్షన్ సైడ్ తో ఆకట్టుకుంది.
 
ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రం రూపొందుతోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
 
'డబుల్ ఇంపాక్ట్' అనే  ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
 త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.