శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2024 (18:14 IST)

టిల్లు స్క్వేర్ కల్ట్ సినిమా అంటే ఇదేనా?

Anupama Parameswaran, Siddhu
Anupama Parameswaran, Siddhu
ఈమధ్య కల్ట్ సినిమాల పేరుతో పలు కథలు వస్తున్నాయి. బేబీ సినిమా శ్రుతిమించింది. నాలుగు గోడలమధ్యలో వుండే అంశాలను తీసుకుని వెండితెరపై, ఓటీటీలలోనూ విడుదల చేస్తున్నారు. తాజాగా వాలెంటెన్ డై సందర్భంగా మరోసారి బేబీ విడుదలయింది. ఇక మరో కల్ట్ సినిమా అని టిల్లు స్క్వేర్ విడుదలవుతుంది. ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. అందులో అంశాలు చాలామటుటకు ఇప్పటి ట్రెండ్ కు తగినట్లు అని చిత్ర దర్శకుడు చెబుతున్నా సినీ గోయర్స్ మాత్రం యూత్ ను చెడగొట్టేవిధంగా వున్నాయని తెలియజేస్తున్నారు.
 
Anupama Parameswaran, Siddhu
Anupama Parameswaran, Siddhu
టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. 'డీజే టిల్లు'లో  సిద్ధు పలికిన "అట్లుంటది మనతోని" వంటి పలు మాటలు.. టిల్లు అభిమానులతో పాటు సామాన్యులలో కూడా రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి. 
 
ఇక తాజాగా సీక్వెల్ లో.. అనుపమ పరమేశ్వరన్, సిధ్ధు మధ్య కెమిస్ట్రీ బాగుందని టాక్ వచ్చేసింది. ఇక ట్రైలర్ లో మాత్రం డైలాగ్ లు సన్నివేశాలు శ్రుతిమించాయి. సెక్స్ ఈజ్ గుడ్ హెల్త్ అంటూ అనుపమ అనగానే.. సెక్స్ ఎప్పుడూ గుడ్డే.. అంటూ సిద్దు అనడంతోపాటు ఏకంగా లిప్ కిస్ లు రొమాన్స్ మామూలుగా లేదు. మరి సెన్సార్ ఏవిధంగా స్పందిస్తో, విడుదల తర్వాత యూత్ లో మరో ట్రెండ్ స్రుష్టిస్తుందో చూడాలి.